మరక మార్కు పబ్లిసిటీ గిమ్మిక్కు!

Update: 2016-10-27 02:35 GMT

సార్వత్రిక ఎన్నికలకు ఏ స్థాయి ప్రచారాలు జరుగుతాయో అదే రీతిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు కూడా జరగటం మనం మా అసోసియేషన్ మరియు నడిగర్ సంఘం ఎన్నికలకు చూసాం. వీటన్నిటికీ మించి కొత్త తరహా కథలు తెర పై చూపకపోయినా, ప్రచారంలో భాగంగా చెప్తూ ప్రేక్షకులను వారి సినిమాపై ఆకర్షితులని చేస్తుంటారు దర్శకులు. ఈ తరహా ప్రచారాలలో ముందు ఉండేది బాలీవుడ్ అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండదు. దీనికి నిదర్శనమే హే దిల్ హై ముష్కిల్ ప్రచారంలో భాగంగా అనుష్క శర్మ గురించి దర్శకుడు కరణ్ జోహార్ చేసిన వ్యాఖ్యలు.

అనుష్క శర్మ నట జీవితం మొదలు పెట్టిన నాటికి రబ్ నే బనాది జోడి వంటి పెద్ద చిత్రాలలో నటించే స్థాయి హీరోయిన్ కాదు అని తాను అభిప్రాయపడే వాడిని అని కారం జోహార్ స్వయంగా తెలిపాడు. యష్ రాజ్ సంస్థ అనుష్క శర్మ ని నాయిక గా తీసుకున్నప్పుడు కూడా వారిని వారించానని, వారు తన వాదనని పట్టించుకోలేదు అని చెప్పాడు కరణ్ జోహార్. ఆ చిత్రంలో అనుష్క శర్మ కనబరిచిన అభినయానికి అందరిలానే తాను కూడా ఆశ్చర్యపోయానని, ఒక అద్భుత నటిని ముందుగా గుర్తించలేకపోయినందుకు సిగ్గు పడ్డానని కూడా జోడించాడు కరణ్.

అయితే ఈ వివరాలు అన్ని విలేకరుల ప్రశ్నలకు సంబంధం లేకుండా తానే సందర్భం సృష్టించుకుని మరీ చెప్పేసరికి ఇది సినిమా వాళ్ళ పబ్లిసిటీ స్టంట్ అని తీసి పడేసారు ముంబై జనం. ఈ నెల 28 న హే దిల్ హై ముష్కిల్ చిత్రం విడుదల కాబోతుంది.

Similar News