బాహుబలి2 లో సగానికి కూడా చేరుకోలేని చిరు!

Update: 2016-10-29 02:13 GMT

బాహుబలి 2 బిజినెస్ వేరు.. తతిమ్మా మన హీరోలు చేసే అన్ని రకాల చిత్రాల బిజినెస్ వేరు. ఒక రకంగా చెప్పాలంటే వీటిని పోల్చడానికి కూడా వీల్లేదు. కానీ మెగాస్టార్ అంతటి వాడు తన జీవితంలో 150 వ చిత్రం చేస్తున్నప్పుడు.. ఆ చిత్రం ద్వారా ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఉన్న సమస్త రికార్డులను బద్ధలు కొట్టేయాలని కలగంటూ ఉన్నప్పుడు.. కంపేర్ చేయడంలో తప్పేమీ లేదు. కానీ వాస్తవంగా వచ్చే ఏడాది విడుదల కావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్రాలు ప్రస్తుతం చేస్తున్న బిజినెస్ ను గమనినంచినప్పుడు.. బాహుబలి 2 చేసే బిజినెస్ లో సగానికి కూడా మెగాస్టార్ చిరంజీవి చిత్రం రీచ్ కావడం లేదని అనిపిస్తోంది.

మొత్తం అన్ని ఏరియాలు, శాటిలైట్ సమస్తం కలిపి కూడుకుని లెక్కలు వేయడం సంగతి తర్వాత.. ఒకే ఒక్క నైజాం రైట్ల్ అమ్ముడైన ధరలనే పోల్చి చూసుకున్నా సరే ఈ సంగతి మనకు అర్థమైపోతుంది.

భారీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ లోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించిన తర్వాత.. ఆ రంగం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ఈ రెండు భారీ చిత్రాలను ఏషియన్ ఎంటర్ ప్రైజెస్ వారే నైజాం హక్కులు తీసుకున్నారు. ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాన్ని 2.5 కోట్ల రికవరబుల్ బేసిస్ లో 21 కోట్లకు వారు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సంస్థ బాహుబలి 2 చిత్రాన్ని నైజాం ఏరియాకు 50 కోట్లకు కొన్నారు.

నైజాం హక్కుల విషయంలో మెగాస్టార్ వెలుగు వెలుగుతున్న రోజుల్లో ఆయనను మించిన మార్కెట్ మరెవ్వరికీ ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు బాహుబలి 2 అమ్మిన ధరలో కనీసం సగానికి కూడా మెగాస్టార్ చిత్రం రీచ్ కాలేకపోవడం గమనార్హం.

Similar News