బాహుబలి 2 .. స్టోరీలైన్ ఇదేనంట

Update: 2016-09-22 13:41 GMT

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకం గా తెరకెక్కిస్తున్న 'బాహుబలి 2' రోజు రోజు అంచనాలు పెంచుకుంటూ పోతుంది. మొదట భాగంతోనే ఎంతో పేరు, డబ్బు సంపాదించినా 'బాహుబలి' రెండో భాగం తో తన రికార్డు ను తానె బ్రేక్ చేసేలా రాజమౌళి దీన్ని తీర్చి దిద్దుతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబందించి ఎటువంటి విషయాలు బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళికి పెద్ద షాక్ తగిలింది.

అదేమిటంటే 'బాహుబలి 2' స్టోరీ ఇదేనంటూ ఇప్పడు సోషల్ మీడియా లో ఒక స్టోరీ చెక్కర్లు కొడుతోంది. మరి ఇది నిజమైన కథా లేక ఎవరన్నా ఇలా క్రియేట్ చేశారా అన్నది మాత్రం తెలియదు. ఆ స్టోరీ ఏమిటో మీకు తెలుసుకోవాలనుందా అయితే చదవండి.

బాహుబలిని నేనే చంపానంటూ సస్పెన్సు కి తెర దించుతూ శివునికి కట్టప్ప అసలు కథ చెప్పడం ప్రారంభిస్తాడు కాలకేయుణ్ణి అంతమొందించిన తర్వాత బాహుబలి మాహిష్మతికి రాజు అవుతాడు అయితే బాహుబలి రాజు అవ్వడాన్ని భల్లలదేవుని తండ్రి బిజ్జల దేవుడు జీర్ణించుకోలేక పోతాడు. బాహుబలిపై వున్నా కోపం మరింత ఎక్కువవుతుంది. భల్లాలదేవుడు కూడా తనకు రాజ్యాధి కారం దక్కనందుకు కోపంతో రగిలి పోతూ ఉంటాడు. ఇక ఎలాగైనా మాహిష్మతి ని దక్కించికోవాలని తండ్రి కొడుకులు ప్లాన్ చేస్తారు. ఇదిలా ఉండగా బాహుబలి కుంతల రాజ్యానికి చెందిన దేవసేనని చూసి ఇష్ట పడతాడు దేవసేన కూడా బాహుబలిని ప్రేమిస్తుంది మరో పక్క భల్లల దేవుడు కూడా దేవసేనని ప్రేమిస్తాడు భల్లాలదేవుని ప్రేమని తెలుసుకున్న బిజ్జల దేవుడు కుంతల రాజ్యానికి ఒక రాయభారం పంపుతాడు కానీ ఆ రాయభారం కుంతల రాజుకు చేరకుండానే బాహుబలి కి దేవసేనకి ప్రేమ అందరికి తెలిసిపోతుంది.ఇది సహించని బిజ్జలదేవుడు భల్లాలదేవునికి సాయం చెయ్యమని శివగామిపై వత్తిడి తీసుకు వస్తాడు. ఇక శివగామి చేసేది లేక బిజ్జలదేవుడి మాటలకి తలొగ్గి... బాహుబలిని నీకు రాజ్యం కావాలా లేక దేవసేన కావాలా అని కండిషన్ పెడుతుంది. బాహుబలి రాజ్యాన్ని త్యజించి దేవసేనతో దూరం గా వెళ్ళిపోతాడు. ఇక భల్లాల దేవుడు మాహిష్మతి ని ఏలుతూ బాహుబలిపై కక్ష సాధించి అతన్ని కట్టప్పతో చంపిస్తాడు. దేవసేనని బందీగా తన కోటాలో ఉంచుతాడు. ఇక తర్వాత శివుడు భల్లాల దేవుణ్ణి చంపేస్తాడు ఇది 'బాహుబలి 2' కథ అంటూ ప్రచారం జరుగుతుంది.

మరి ఈ కథా కరెక్ట్ గా 'బాహుబలి 1' కి సింక్ అయ్యేటట్లు గా ఉండడం తో అందరూ ఇది ఖచ్చితం గా 'బాహుబలి 2' కథే అని ప్రచారం జరుగుతుంది. మరి ఈ స్టోరీ ఇలా లీక్ అవ్వడం పై రాజమౌళి స్పందనేమిటో చూద్దాం.

Similar News