ప్రభాస్‌కు బర్త్‌డే కానుక : స్పెషల్ స్టిల్

Update: 2016-10-22 12:57 GMT

రెబెల్ స్టార్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి తనదైన శైలిలో కొత్త కానుకను అందించారు. ప్రభాస్ ఆదివారం నాడు పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా.. బాహుబలి 2 లోని ప్రభాస్ స్టిల్ ను బర్త్ డే స్పెషల్ కానుకగా రాజమౌలి విడుదల చేశారు. ఈ స్టిల్ ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

బాహుబలి చిత్రం మొదటి భాగం తయారవుతున్న రోజులనుంచి రాజమౌళి ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు. ఆ చిత్రంలో ప్రధాన నటులందరి పుట్టినరోజుల సందర్భంగా.. ఇదే తరహాలో ఆ చిత్రంలోని సరికొత్త స్టిల్స్ ను విడుదల చేస్తూ వచ్చారు.

అదరగొట్టిన రాజమౌళి

బాహుబలి మొదటి భాగం దేశవ్యాప్తం గా ఎంత సంచలనామో అందరికి తెలిసిందే. రాజమౌళి ఒక రేంజ్ లో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేసాడు. బాహుబలి 1 తో ప్రభాస్ తో సహా ఈ సినిమాలో నటించిన నటీనటులు మంచి గుర్తింపు పొందారు. బాహుబలి పార్ట్ 1 సినిమా ఎన్ని సంచలనాలకు నెలవైందో..... ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 కూడా విడుదలకు ముందే సంచలనాలని క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమా 2017 ఏప్రిల్ 28 న విడుదల తేదీ ప్రకటించేశారు. అయితే ఇప్పటివరకు సైలెంట్ గా షూటింగ్ జరుపుకున్న బాహుబలి 2 ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ప్రేక్షకులముందుకు వచ్చింది. రేపు ప్రభాస్ పుట్టిన రోజు స్పెషల్ గా బాహుబలి టీమ్ ఈ ఫస్ట్ లుక్ ని ఒక రోజు ముందే ప్రభాస్ అభిమానుల కోసం విడుదల చేసింది. ఈ బాహుబలి ఫస్ట్ లుక్ ని రాజమౌళి అండ్ టీమ్ ముంబై లో విడుదల చేశారు. ఈ విడుదల కార్యక్రమం లో రాజమౌళితో పాటు అనుష్క, ప్రభాస్ లు పాల్గొన్నారు.

బాహుబలి పార్ట్ వన్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించిన రాజమౌళి ఇప్పుడు బాహుబలి పార్ట్ 2 లో ప్రభాస్ ని ఒక చేతిలో కత్తిని పట్టించి మరో చేతిలో ఇనుప గొలుసులతో ప్రభాస్ ని అబ్బో అనిపించే రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అసలు ఇలా ప్రభాస్ ని చూసిన వాళ్లకి బాహుబలిలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో వుంటాయో అని అప్పుడే చర్చించుకోవడం మొదలెట్టేసారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని వచ్చే జనవరిలో విడుదల చేస్తామని రాజమౌళి ఎప్పుడో చెప్పాడు. ఇక ప్రేక్షకులందరూ ఆ టీజర్ కోసం కళ్ళల్లో వత్తులేసుకుని ఆసక్తిగా జనవరి వరకు ఎదురు చూడాల్సిందే.

Similar News