పవన్ ఇన్వాల్వ్‌మెంట్ : బాబీ పరిస్థితే డాలీది కూడా!

Update: 2016-10-27 05:19 GMT

పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఒప్పుకున్నాడు అంటే అతను ఆ సినిమాకి సంబందించి చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అవుతాడనే ప్రచారం బాగావుంది. ఇక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అయితే చెప్పక్కర్లేదు....డైరెక్టర్ కంటే ఎక్కువగా పవన్ ఇన్వాల్వ్ అవుతాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. అయితే ఇది తట్టుకుని నిలబడిన వాడే పవన్ తో సినిమా చేయగలుగుతాడు. లేకుంటే తన దారి తాను చూసుకుంటాడు. అని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే వారు కూడా పవన్ కల్యాణ్ సినిమాను తాము డైరక్ట్ చేశామనే మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఆరాటపడుతుంటారని కూడా పలువురు అనుకుంటూ ఉంటారు.

ఆ మద్యన వచ్చిన సర్దార్ సినిమా దీనికి పెద్ద ఉదాహరణ. డైరెక్టర్ బాబీ ఈ సినిమాకి డమ్మీ డైరెక్టర్. అంతా పవన్ ఈ సినిమాని తానె తీసుకున్నాడని తెగ ప్రచారం జరిగింది. ఆ సినిమా ఏమైంది ఘోరమైన ప్లాప్ మూటగట్టుకుంది. అయినా పవన్ మనస్తత్వం లో ఏ మార్పు లేదు. మళ్ళీ పవన్ ఇప్పుడు కాటమరాయుడు సినిమాలో కూడా ఇలాంటి మాటలే వినబడుతున్నాయి. డైరెక్టర్ డాలి ని ఏదో డైరెక్టర్ కింద పెట్టుకుని ఆ సినిమాకి అన్ని తానై పవన్ నడిపిస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఇందులో భాగం గానే పవన్ డాలి మీద తీవ్ర అసంతృప్తితో వున్నాడని అంటున్నారు. మరి పాపం డాలి ఏం చేసాడో పవన్ విషయం లో పవన్ కి అంత కోపం రావడానికి...... ఈ కోపం తోనే పవన్ షూటింగ్ స్పాట్ నుండి వెళ్లిపోయాడని ప్రచారం జరుగుతుంది.

అయితే పవన్ మళ్ళీ తనకు తాను సంబాళించుకుని షూటింగ్ కి హాజరైనట్టు సమాచారం. అయితే పవన్ - డాలి సంబంధాలు ఇదివరకటి మాదిరిగా లేవని అంటున్నారు. ఇద్దరూ షూటింగ్ స్పాట్ లో ఎడ మొహం పెడా మొహం గా వుంటున్నారని సమాచారం. అయితే డాలి ఈ సినిమాని వదిలిపెట్టేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే దీనికి డైరెక్టర్ గా అనుకున్న ఎస్ జె సూర్య పవన్ ఇన్వాల్వ్ మెంట్ ను భరించలేక వెళ్లిపోయాడని రూమర్ వుంది. ఇక డాలి వెళ్ళిపోయినా ఇండస్ట్రీలో ఇలానే అనుకునే ప్రమాదం చాలానే వుంది. మరి పవన్ కొన్ని విషయాల్లో తగ్గితే బావుంటుంది లేకుంటే చాలా నష్ట పోవాల్సి వస్తుందని అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.

Similar News