నటి భావన నిశ్చితార్థం

Update: 2017-03-09 16:07 GMT

ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన మళయాళ నటి భావన ప్రియుడితో నిశ్చితార్ధం చేసుకున్నారు. మలయాళ నిర్మాత నవీన్‌తో గురువారం భావన నిశ్చితార్థం చేసుకున్నారు. పరిమితంగా హాజరైన అతిథుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. మూవీ ఇండస్ట్రీ ట్రాకర్‌ రమేశ్‌ బాలా తన ట్విటర్‌ ఖాతా ఈ వార్తను ప్రకటించారు. భావన పెళ్లి తేదీని నిర్ణయించలేదు. భావన, నవీన్‌ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని భావన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాము 2014లోనే వివాహం చేసుకోవాలనుకున్నామని, కానీ వృత్తిపరంగా ఉన్న నిబద్ధతల వల్ల కుదరలేదని అప్పట్లో ఆమె చెప్పారు. ‘మహాత్మ’, ‘ఒంటరి’, ‘నిప్పు’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన భావన అనేక మలయాళ చిత్రాల్లో నటించారు. మలయాళం నటి భావన కన్నడ నిర్మాత నవీన్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. నిశ్చితార్థం సందర్భంగా భావన ఆప్తమిత్రురాలు, మాలీవుడ్‌ నటి మంజు వారియర్‌ కొత్తజంటతో కలిసి ఫొటో దిగారు. నవీన్‌తో కొంతకాలంగా భావనకు అనుబంధం ఉంది. భావన ప్రస్తుతం పృథీరాజ్‌ హీరోగా నటిస్తున్న ఆదమ్‌ చిత్రంలో నడిస్తోంది.

Similar News