అనసూయ కి షాకిచ్చిన చిరు?

చిరంజీవి – కొరటాల కాంబో మూవీ ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ తో చిరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక [more]

Update: 2020-01-09 05:58 GMT

చిరంజీవి – కొరటాల కాంబో మూవీ ఈ నెలాఖరు నుండి పట్టాలెక్కబోతుంది. కొరటాల శివ పక్కా స్క్రిప్ట్ తో చిరు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక చిరు కొరటాల శివ కోసం ఒళ్ళు తగ్గించి ఫిట్ గా ఉండాలని ప్రిపేర్ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా చేస్తుంది అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమాలో రంగస్థలం లో రంగమ్మత్తగా అదరగొట్టిన అనసూయ కి ఓ కీ రోల్ ని కొరటాల సిద్ధం చెయ్యడం దానికి చిరు ఓకె చెప్పడంతో.. అనసూయ ,కొరటాల – చిరు సినిమాలో ఫిక్స్ అన్నారు. అయితే తాజాగా చిరంజీవి, అనసూయ కి షాకిచ్చి ఆమె పాత్ర కి మరొక హీరోయిన్ ని తీసుకోబోతున్నాడనే టాక్ నడుస్తుంది.

సరిలేలు నీకెవ్వరూ సినిమాలో భారతి గా రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈమధ్యన సరిలేరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరుని కలవడంపై అదో పెద్ద సెన్సేషన్ అవడం జరిగాయి. చిరు – విజయశాంతి కలిసి దాదాపుగా 20 సినిమాలు చెయ్యడం.. సరిలేరు ఈవెంట్ లో చిరు ఆప్యాయంగా విజయశాంతితో మాట్లాడం.. అలాగే సరిలేరు ఈవెంట్ లో మహేష్ కన్నా ఎక్కువగా చిరు – విజయశాంతిల కలయిక హైలెట్ అవడంతో.. చిరు ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాలో విజయశాంతికి ఓ రోల్ ఇవ్వాలని.. అది అనసూయ చెయ్యబోయే పాత్రనే కొద్దిగా నిడివి పెంచి అనసూయని తప్పించి విజయశాంతితో ఆ రోల్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇక చిరు ఆలోచనకు కొరటాల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్పడం.. దానితో అనసూయ కి అలా చిరు షాకిచ్చాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ లు కూడా హల్చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News