రూమర్ కాదు నిజమే

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా త్వరగా కంప్లీట్ చేసి వెంటనే పూరి సినిమా షూటింగ్ లో పాల్గొనాలి చూస్తున్నాడు. పూరి [more]

Update: 2019-08-25 13:07 GMT

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా త్వరగా కంప్లీట్ చేసి వెంటనే పూరి సినిమా షూటింగ్ లో పాల్గొనాలి చూస్తున్నాడు. పూరి సినిమా కథ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు విజయ్. రీసెంట్ గా పూరి – విజయ్ కాంబినేషన్ లో సినిమా అని అధికారంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఊపు మీద ఉన్న పూరి ప్రస్తుతం విజయ్ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈసినిమా కోసం ఆల్రెడీ ఓ టైటిల్ అనేసుకున్నారు కూడా. అదే ‘ఫైటర్’ అని. కాకపోతే మొన్నటివరకు ఇది రూమర్ అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ టైటిల్ కె విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈమూవీ యొక్క షూటింగ్ నవంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది.

అసలు ఈమూవీ ఏ జోనర్ లో తెరకెక్కుతుంది? ఇందులో హీరోయిన్ ఎవరు? మిగిలిన నటీనటులు ఎవరు? అనే విషయాలు త్వరలోనే అధికారంగా తెలియనున్నాయి. ఈమూవీ ని పూరి అండ్ ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నారు. విజయ్ – పూరి కాంబినేషన్ అంటే ఇప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News