ఊగిసలాటలో పవన్ రీ ఎంట్రీ సినిమా?

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొంతమంది నిర్మాతలు ఆధికారికంగా ఎనౌన్స్ చేయడం…. ఆ పింక్ రీమేక్ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ ఆధ్వర్యంలో [more]

Update: 2019-11-28 06:59 GMT

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని కొంతమంది నిర్మాతలు ఆధికారికంగా ఎనౌన్స్ చేయడం…. ఆ పింక్ రీమేక్ స్క్రిప్ట్ ని త్రివిక్రమ్ ఆధ్వర్యంలో తెలుగులో పంచ్ డైలాగ్స్ తో రూపుదిద్దుకుంటుందని అన్నారు. పవన్ క్లారిటీ ఇవ్వకపోయినా.. ఈ ప్రాజెక్ట్ లో దిల్ రాజు ఉండేసరికి పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్ పక్కాగా చేస్తాడని అందరూ డిసైడ్ అయ్యారు. ఇక దిల్ రాజుకి తోడుగా త్రివిక్రమ్ ఓన్ బ్యానేర్ లాంటి హారిక హాసిని వారు కూడా ఈ సినిమాలో పెట్టుబడి పెట్టబోతున్నారనే టాక్ నడిచింది. త్రివిక్రమ్ – పవన్ స్నేహితులు కాబట్టి ఇది కూడా వర్కౌట్ అయ్యేలా ఉందనుకున్నారు.

తాజాగా త్రివిక్రమ్ అండ్ హారిక హాసిని వారిని కలుకుపోవాలంటే దిల్ రాజు ఇబ్బందిపడుతున్నట్లుగా… దర్శకుడు వేణు శ్రీరామ్ తోనే దిల్ రాజు సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేయించుకోవాలని తెలియడంతో… పవన్ పింక్ రీమేక్ ప్రాజెక్ట్ నుండి త్రివిక్రమ్ మరియు హారిక హాసిని కూడా తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. మరో పక్క దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం తెగ వెయిట్ చేసి ఉన్నప్పటికీ.. దిల్ రాజుకి వైసిపికి ఉన్న సంబంధాల వలన.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి వైసిపికి రాజకీయాలపరంగా అస్సలు పడని నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాపై దిల్ రాజు పునరాలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు పవన్ రీ ఎంట్రీ సినిమా పింక్ ఉంటుందో లేదో కూడా ఇపుడు చెప్పడం కష్టమంటున్నారు.

Tags:    

Similar News