హీరోయిన్ ని హర్ట్ చేసిన త్రివిక్రమ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో మెయిన్ [more]

Update: 2019-05-22 08:25 GMT

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్. ఇక రీసెంట్ గా రెండో హీరోయిన్ గా కేతిక శర్మను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న రెండవ సినిమా ‘రొమాంటిక్’లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు త్రివిక్రమ్ ఆమెకు అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడట. అయితే త్రివిక్రమ్ ఈ హీరోయిన్ ను సెలెక్ట్ చేయడం ఒక తెలుగు హీరోయిన్ కు అసలు నచ్చలేదట.

ఛాన్స్ ఇవ్వని త్రివిక్రమ్

ఒక పాపులర్ తెలుగు అమ్మాయి అల్లు అర్జున్ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ఎప్పటినుంచో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కాంటాక్ట్ లో ఉందని తెలుస్తోంది. తరచూ తన సోషల్ మీడియా అకౌంట్ లో గ్లామరస్ గా మారగలను అన్నట్లు హింట్లు కూడా ఇచ్చింది. కేవలం నాలుగైదు సీన్లు, ఒక పాటకు మాత్రమే పరిమితమైన ఈ పాత్ర ఎలాగైనా చేయాలని ఆమె అనుకుంది. కానీ త్రివిక్రమ్ కేతిక శర్మను దాదాపు కంఫర్మ్ చేసినట్టు చెబుతున్నారు. దీంతో ఈ తెలుగు బ్యూటీ హర్ట్ అయింది. ఆమె ఎవరు మీకు ఇప్పటికే అర్ధం అయిపోయి ఉంటది.

Tags:    

Similar News