అలా ఒక్కటే కాదు.. మరో రెండు సినిమాల్లోనూ షాకిచ్చారట

ఈమధ్యన 30 ఇయర్స్ పృద్వి రాజ్ న్యూస్ లు సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ గా ఓవెరెక్షన్ చేసిన పృద్వి రాజ్ కి [more]

Update: 2020-01-27 07:18 GMT

ఈమధ్యన 30 ఇయర్స్ పృద్వి రాజ్ న్యూస్ లు సోషల్ మీడియాలో పిచ్చ పిచ్చగా వైరల్ అవుతున్నాయి. పొలిటికల్ గా ఓవెరెక్షన్ చేసిన పృద్వి రాజ్ కి ఏపీ సీఎం జగన్ ఝలక్ ఇవ్వడంతో…. చేసేదేం లేక SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసాడు. అయితే వైసిపి ప్రభుత్వ అండతో సినిమా ఇండస్ట్రీలోని పెద్దలను ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్న పృద్వి కి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా షాకిచ్చేలా ఉంది. ఏపీ ప్రభుత్వం లో తనకి తగిన పదవి ఇచ్చారని… SVBC లో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన పృద్వి ఇప్పుడు కక్కలేక మింగలేక ఉన్నాడు.

ఎందుకంటే పవన్ పై చేసిన వ్యాఖ్యల ఫలితంగా అలా వైకుంఠపురములో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న పృధివి కి ఇప్పుడు మరో రెండు పెద్ద ప్రాజెక్టులు కూడా చేజారినట్టుగా టాక్. రెండు బడా సినిమాల్లో పృథ్వి పేరు పరిశీలించినప్పటికీ.. మెగా ఫ్యామిలీ తో పృథ్వి వైరం పెట్టుకోవడంతో పృద్వి పేరు తీసేసి వేరే నటులను తీసుకున్నారట. మరి అలా వైకుంఠం లాంటి బిగ్ హిట్ చేజారడమే కాకుండా ఇప్పుడు మరో రెండు బడా ఛాన్స్ లు మిస్ కావడంతో.. 30 ఇయర్స్ పృద్వికి ఇక సినిమా ఛాన్స్ లు కష్టమే అంటున్నారు. SVBC లో కామెడీ స్కిట్స్ చేసినట్టుగా ఏ కామెడీ సినిమాలకో పృద్వి పరిమితం అవడం తప్ప అతను చేసేదేం లేదంటున్నారు.

Tags:    

Similar News