100 కోట్ల పారితోషకానికొచ్చిన చిక్కులు

కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే విజయ్ అంటారు. అసలు తాజాగా రజిని క్రేజ్ దాటి విజయ్ ఎప్పుడో ముందుకెళ్ళిపోయాడు. విజయ్ అభిమాన [more]

Update: 2020-02-06 07:11 GMT

కోలీవుడ్ లో రజినీకాంత్ తర్వాత సూపర్ స్టార్ ఎవరయ్యా అంటే విజయ్ అంటారు. అసలు తాజాగా రజిని క్రేజ్ దాటి విజయ్ ఎప్పుడో ముందుకెళ్ళిపోయాడు. విజయ్ అభిమాన గణం మామూలుది కాదు. విజయ్ సినిమాలు యావరేజ్ టాక్ తోనే కోట్లు కొల్లగొడుతున్నాయి అంటే విజయ్ క్రేజ్ ఎంతగా హై లో ఉందొ అర్ధమవుతుంది. తాజాగా విజయ్ మాస్టర్ సినిమాని ఖైదీ సినిమా డైరెక్టర్ తో చేస్తున్నాడు. మాస్టర్ సినిమా షూటింగ్ లో విజయ్ బిజీగా ఉన్నాడు. అయితే విజయ్ ఇప్పుడు కోలీవుడ్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరో అంటూ ప్రచారం జరుగుతుంది. 100 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సమాయంలో విజయ్ మీద ఐటి అధికారుల దాడులు ఇప్పుడు విజయ్ అభిమానులకు షాకిచ్చింది.

విజయ్ గత ఏడాది నటించిన బిగిల్ సినిమా నిర్మాతలైన ఏజిఎస్ థియేటర్స్ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలతో…. ఐటి అధికారులు ఏజిఎస్ సంస్థ కు సంబందించిన ఆఫీసులతో పాటుగా.. విజయ్ కి సంబందించిన ఆస్తులపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహించినట్లుగా కోలీవుడ్ మీడియా కథనం. ఏజిఎస్ సినిమాస్ ఆస్తులు, ఫైనాన్సియర్ అంబు చెలియర్ ఇంట్లో, ఆఫీస్ లలో తనిఖీలు నిర్వహించడమే కాకుండా.. దాదాపుగా 20 చోట్ల ఆదాయపు పన్ను శాఖ వారు దాడులు నిర్వహించడం తో పాటుగా.. విజయ్ మాస్టర్ షూటింగ్ చిత్రీకరణ జరుగుతున్న కడలూరికి ఐటి అధికారులు వెళ్లి విజయ్ ని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. మరి విజయ్ కూడా ఐటి లెక్కలు సరిగ్గా చూపలేని కారణంగా ఐటి అధికారులు విజయ్ ని ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది

Tags:    

Similar News