చిరు కి ఝలక్ ఇచ్చిన డైరెక్టర్?

మెగాస్టార్ చిరు తో సినిమా చెయ్యాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుకుమర్ లాంటి దర్శకులు చిరంజీవితో సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. [more]

Update: 2019-11-09 03:07 GMT

మెగాస్టార్ చిరు తో సినిమా చెయ్యాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. ఇప్పటికే పూరి జగన్నాథ్, సుకుమర్ లాంటి దర్శకులు చిరంజీవితో సినిమా కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కొరటాల శివ తో సినిమా చేస్తున్న చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ఫిలిం లూసిఫెర్ ని రీమేక్ రైట్స్ కొన్నాడు. అయితే లూసిఫెర్ రీమేక్ ని రామ్ చరణ్, సుకుమార్ కి అప్పగించాలని ప్లాన్ చేసాడు. సుకుమార్ కూడా ముందు చిరు తో లూసిఫర్ రీమేక్ పై సానుకూలంగానే స్పందించాడు. అయితే అల్లు అర్జున్ తో సుకుమార్ తాజాగా ఓ మూవీని పట్టాలెక్కించాడు.సుకుమార్, అల్లు అర్జున్ సినిమాని, చిరు, కొరటాల సినిమాని పూర్తి చేసాక సుకుమార్ తో చిరు లూసిఫర్ రీమేక్ ఉండబోతుందని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అయితే తాజా సమాచారం ప్రకారం సుకుమార్ లూసిఫెర్ రీమేక్ చెయ్యనని రామ్ చరణ్ కి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మెగా ఆఫర్ ని సుకుమార్ సున్నితంగా తిరస్కరించాడని, ఈలెక్కల మాస్టర్ లెక్కల ప్రకారం రీమేక్ సినిమాలు చెయ్యకూడదని అనుకోవడం వల్లనే లూసిఫర్ రీమేక్ ని వదిలేసినట్టుగా ఫిలింనగర్ టాక్. ఇక చిరు దగ్గర లూసిఫర్ రైట్స్ ఉండడంతో.. ఇప్పుడు రామ్ చరణ్ ఆ రీమేక్ కోసం మరో డైరెక్టర్ వేటలో పడినట్లుగా తెలుస్తుంది

Tags:    

Similar News