బిగ్ బాస్ తో శ్రీముఖికి బాగానే వర్కౌట్ అయ్యింది

బిగ్ బాస్ సీజన్ 3 లో కేవలం గొంతేసుకుని.. యాక్టీవ్ గా ఉంటూ ఫైనల్ స్టేజ్ లో సెకండ్ ప్లేస్ లో నించున్న శ్రీముఖి కి బిగ్ [more]

Update: 2019-11-19 07:30 GMT

బిగ్ బాస్ సీజన్ 3 లో కేవలం గొంతేసుకుని.. యాక్టీవ్ గా ఉంటూ ఫైనల్ స్టేజ్ లో సెకండ్ ప్లేస్ లో నించున్న శ్రీముఖి కి బిగ్ బాస్ వలన బాగానే వర్కౌట్ అయ్యింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన శ్రీముఖి బిగ్ బాస్ హౌసెమెట్స్ కి అందకుండా తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవ్స్ కి చెక్కేసి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసిన శ్రీముఖికి బిగ్ బాస్ మంచి చేయడమేమిటి అనుకుంటున్నారా? శ్రీముఖి నిజంగా బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఎలాంటి నెగెటివిటి లేని సెలెబ్రిటీ. కానీ బిగ్ బాస్ కి వెళ్ళాక రాహుల్ విషయంలో, టాస్క్ ల విషయంలో శ్రీముఖి మెంటాలిటీ విషయంలో ఆమె చాలా నెగిటివిటీని మూటగట్టుకుంది.

అయితే శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లో చాలా యాక్టీవ్ గా గొంతేసుకుని అరుస్తూ. నాగార్జున తో లౌడ్ స్పీకర్ అంటూ బిరుదు ఇప్పించుకుంది. అయితే శ్రీముఖి కి బిగ్ బాస్ హౌస్ లో ఆమె గొంతు ఎంత మేలు చేసిందో.. ఇప్పుడు బయటికొచ్చాక ఆమె కేకలు అరుపులతో లౌడ్ స్పీకర్ అంటూ శ్రీముఖి ని యాంకర్ గా పెట్టి స్టార్ మా యాజమాన్యం ఓ షో ని రెడీ చేసింది. శ్రీముఖి తో ఆ లౌడ్ స్పీకర్ షో లో గట్టిగా అరిపించడానికి స్టార్ మా రెడీ అయ్యింది. మరి శ్రీముఖి ఆ షో ప్రోమో లోనే… బిగ్గరగా అరుస్తూ కనిపించింది. ప్రోమోలోనే అలా ఉంటే… ఆమె ఆ షో లో అరిచే అరుపులకు స్టార్ మా ప్రేక్షకులకు ఎంత చిరాకు పుడుతుందో..చూద్దాం

Tags:    

Similar News