‘డియర్‌ కామ్రేడ్‌’ రీమేక్ కి ‘నో’ చెప్పిన హీరో

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చాలా స్లో గా ఉండడంతో ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు. [more]

Update: 2019-08-11 07:28 GMT

సెన్సషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా చాలా స్లో గా ఉండడంతో ప్రేక్షకులు దీన్ని తిరస్కరించారు. ఇది పక్కన పెడితే ఈసినిమా యొక్క హిందీ రైట్స్ ప్రముఖ బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈమూవీ రిలీజ్ కి ముందు స్పెషల్ స్క్రీనింగ్ లో చూసినా కరణ్ ఇది ఓ అందమైన ప్రేమకథ అని, తనకు బాగా నచ్చిందని ట్వీట్‌ చేశారు. అయితే ఈసినిమా రీమేక్ లో బాలీవుడ్ నటుడు షాహిద్‌ కపూర్‌ను ఎంపికచేసుకోవాలని కరణ్‌ అనుకున్నారట. అందుకు కోసం షాహిద్‌ కపూర్‌ ఏకంగా 40 కోట్లు రెమ్యూనరేషన్ అడిగాడట.

కానీ రీసెంట్ గా అతను ఈ సినిమా చేయను అని చెప్పేసాడు అని బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే షాహిద్‌ కపూర్‌ అర్జున్ రెడ్డి రీమేక్ లో నటించారు. ఇప్పుడు ఈసినిమా రీమేక్ లో నటిస్తే ప్రేక్షకులను ఆకట్టుకోదేమోనన్న ఉద్దేశంతోనే సినిమాకు ‘నో’ చెప్పినట్లు టాక్.

Tags:    

Similar News