కోడలు వద్దంది.. మామగారు ఊరుకోలా

టాప్ హీరోయిన్ సమంత, అక్కినేని ఇంటి కోడలు గా అడుగుపెట్టిన తరవాత అక్కినేని ఫ్యామిలీకి ఎంత కలిసొచ్చిందో తెలియదు కానీ.. సమంత మాత్రం ఏ సినిమాలో నటిస్తే [more]

Update: 2019-06-03 04:50 GMT

టాప్ హీరోయిన్ సమంత, అక్కినేని ఇంటి కోడలు గా అడుగుపెట్టిన తరవాత అక్కినేని ఫ్యామిలీకి ఎంత కలిసొచ్చిందో తెలియదు కానీ.. సమంత మాత్రం ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్. సమంత పెళ్లయ్యాక నటించిన సినిమాలన్నీ అదరగొట్టే హిట్స్ అయ్యాయి. ఇక అక్కినేని ఫ్యామిలీ లోకి అడుగుపెట్టకముందు నుండి నాగార్జున, సమంత ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు. అంతలా సమంత అక్కినేని ఫ్యామిలీతో కలిసిపోయింది. అమల, అఖిల్, నాగ్, అందరూ సమంత ని బాగా ప్రేమిస్తారు కూడా. ఇక చాలా విషయాల్లో నాగార్జున, చైతు కన్నా.. ఎక్కువగా సమంత సలహాలు తీసుకుంటాడని టాక్ ఉంది.

సమంత పెళ్ళికి ముందు నాగార్జున తో కలిసి రాజుగారి గది 2 లో నటించగా.. పెళ్లి తరవాత విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక తాజాగా నాగార్జున మన్మధుడు 2 లో కూడా సమంత ఓ గెస్ట్ రోల్ ప్లే చేస్తుంది. రాహుల్ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జెమినీ కిరణ్ మరియు నాగార్జున కలిసి నిర్మిస్తున్నారు. అయితే సమంత ఇలా మన్మధుడు 2 లో చిన్న రోల్ ఒప్పుకోవడానికి.. ఒక కారణం మామగారి మీదున్న గౌరవం ఒక కారణమైతే… మరో కారణం ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ వైఫ్ చిన్మయి సమంత ఫ్రెండ్ కావడం. అయితే చిన్న రోల్ కదా.. అని సమంత కొద్దీ రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం అడగ్గా… నాగ్ మాత్రం సమంత క్రేజ్ దృష్టిలో ఉంచుకుని.. ఆమె క్రేజ్ కి సరిపడా పారితోషకాన్ని సమంత కి ఇచ్చాడని ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News