అందుకే ఒప్పుకుందా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా…. సమంత అక్కినేని సోషల్ మీడియాలో తెగ బిజిగా ఉంటుంది. మరోపక్క సినిమా అవకాశాలు లేకపోతె పనేం లేదా [more]

Update: 2019-11-23 06:44 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అన్నంత అవకాశాలు లేకపోయినా…. సమంత అక్కినేని సోషల్ మీడియాలో తెగ బిజిగా ఉంటుంది. మరోపక్క సినిమా అవకాశాలు లేకపోతె పనేం లేదా అన్నట్టుగా అమెజాన్ వెబ్ సీరీస్ లో కాలుపెట్టింది. వెబ్ సీరీస్ కున్న విపరీతమైన ఆదరణ వలన సమంత క్రేజ్ ఆ వెబ్ సీరీస్ కి కూడా పనికొస్తుంది అని సమంత ని ప్రత్యేకంగా.. అమెజాన్ లో సీజన్ వన్ సూపర్ హిట్ అయిన ద ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కోసం తీసుకున్నారు దర్శకనిర్మాతలు. సమంత కూడా తన రోల్ నచ్చడము, ఇక్కడ హీరోలు అవకాశాలు ఇవ్వడానికి జంకడంతో మారుమాట్లాడకుండా ఒప్పేసుకుంది.

మరోపక్క ఈ వెబ్ సీరీస్ ద్వారా తాను సక్సెస్ అవడం ఖాయమని, తర్వాత అక్కినేని కాంపౌండ్ లోనే మరో ప్రొడక్షన్ హౌస్ కి ఏర్పాట్లు చెయ్యడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది సమంత . తనకి అభిరుచి గల కథలు వస్తే సినిమా నిర్మాతగా మారతానని చెప్పిన సమంత ఆ దిశగా అడుగులు వెయ్యడానికి సిద్దమవుతుంది. అయితే ద ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ లో సమంత మొదటిసారిగా ఓ నెగెటివ్ పాత్ర వెయ్యబోతుంది. పాకిస్తానీ కుట్రలను భారత్ రా విభాగం తిప్పికొట్టడం అనేది సీజన్ వన్ లో చూసాం. ఇక 2 లో పాకిస్తానీ ఎత్తులు మరీ ఘోరంగా ఉండబోతున్నాయని, అందులో సమంత కీలక టెర్రరిస్ట్ పాత్ర పోషిస్తుందని అంటున్నారు అయితే ఈ పాత్ర ద్వారా సమంత క్రేజ్ మరింత పెరుగుతుందని నమ్మి సమంత అందులోకి దిగడం కన్నా ఆమెకి ఫ్యామిలీ మెన్ దర్శకనిర్మాతలు ఇచ్చే పారితోషకాన్ని బాగా టెంప్ట్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. సమంత కి కళ్ళు చెదిరే పారితోషకం ఇస్తామని చెప్పడంతో..నెగెటివ్ పాత్రకి సమంత ఓకె చేసిందని సోషల్ మీడియా కథనం.

Tags:    

Similar News