సూపర్ డీలక్స్ తెలుగులోకి రావడం సామ్ కి ఇష్టం లేదట

అక్కినేని సమంత, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్. ఇందులో ఓ ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో [more]

Update: 2019-07-29 07:09 GMT

అక్కినేని సమంత, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం సూపర్ డీలక్స్. ఇందులో ఓ ముఖ్య పాత్రలో విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరో కూడా నటించారు. ఇందులో రమ్య కృష్ణ , సమంత స్పైసి పాత్రల్లో నటించడం విశేషం. తమిళంలో రిలీజ్ అయ్యి 6 నెలలు కావస్తుంది ఇంకా తెలుగు ఈసినిమాని ఎవరు కొన్నారు అనేదే తెలియదు.

తమిళ సినిమాలు ఏమాత్రం బాగున్నా అవి ఈజీగా తెలుగు లోకి డబ్ అవుతాయి కానీ ఈ సినిమా ఎందుకో డబ్ కావడంలేదు.కానీ ఈ సినిమా తెలుగులోకి రావడానికి సమంత అంత సుముఖంగా లేదని మాత్రం గ్యాసిప్ లు వినిపిస్తున్నాయిు. కారణం ఇందులో సామ్ సినిమా స్టార్టింగ్ లోనే తన మాజీ ప్రియుడితో సెక్స్ లో పాల్గొనడంతో ప్రారంభమవుతుంది. అటువంటివి ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి అంతగా నచ్చదు అని భావించి పెద్దగా ఈసినిమాపై ఇంట్రెస్ట్ చూపట్లేదట.

అలానే సినిమాలో రమ్యకృష్ణ వేశ్యగా కనిపిస్తుంది. పెళ్లియినా తరువాత మంచి పాత్రలు ఎంచుకుని మరీ నటిస్తున్న సమంత సూపర్ డీలక్స్ లో తన పాత్ర వీటికి భిన్నంగా వుంటుంది కనుక తెలుగులోకి రావడానికి ఆమె అంతగా ఇష్టపడడంలేదని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.

Tags:    

Similar News