మామకి హ్యాండ్ ఇచ్చిన కోడలు

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ తరువాత కోడలు సమంత ఇంతవరకు తన రివ్యూ [more]

Update: 2019-08-10 07:06 GMT

కింగ్ నాగార్జున లేటెస్ట్ మూవీ మన్మధుడు 2 డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకుంది. అయితే ఈసినిమా రిలీజ్ తరువాత కోడలు సమంత ఇంతవరకు తన రివ్యూ ఇవ్వలేదు. సినిమా ఎలా ఉంది? నాగ్ గురించి కానీ ఎటువంటి ట్వీట్ చేయలేదు సామ్. మన్మధుడు 2 ట్రైలర్ రిలీజ్ అప్పుడు ట్వీట్ చేసింది అంతే తరువాత ఎటువంటి ట్వీట్ చేయలేదు. సామ్ తన ఫ్యామిలీ సినిమాల విషయంలో బిగ్ ప్రమోటర్. కానీ ఇప్పుడిలా చేస్తున్నారేంటో?

సామ్ కి నాగ్ ఈ వయసులో ఘాటైన రొమాన్స్ చేయడం.. ముద్దులివ్వడం తనకు నచ్చలేదట. ఈ విషయాన్నీ నాగ్ పబ్లిగ్గా రివీల్ చేశారు కూడా. కానీ నాగ్ మాత్రం ఓ బేబీ సక్సెస్ విషయంలో చాలా ఆనంద పడ్డారు. సినిమాని ప్రమోట్ కూడా చేసారు. కానీ కోడలు మాత్రం కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు.

సామ్ పెళ్లి తరువాత ఎంతో స్వేచ్ఛ గా బోల్డ్ అవతారంలో కనిపించినప్పుడు లేనిది? ఇప్పుడు ఎందుకు కండిషన్స్ పెడుతుందో? నాగ్ కోసం కాకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ చిన్మయి కోసం తన భర్త రాహుల్ కోసం అన్న ఒక ట్వీట్ వేస్తే నష్టం ఏంటంటా? పైగా ఈసినిమాలో సామ్ ఓ గెస్ట్ రోల్ చేసింది. ప్రస్తుతం అభిమానుల్లో ఒకటే ఆసక్తిగా ఈ ముచ్చట సాగుతోంది.

Tags:    

Similar News