సమంత నయా బిజినెస్ ప్లాన్స్?

సమంత తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలు, ప్రేక్షకులకు నచ్చే కథలు కలిగిన సినిమాలే చేస్తూ.. మెల్లమెల్లగా సినిమాలు తగ్గించుకుంటుంది. ఓ పక్క అమెజాన్ వెబ్ సీరీస్, మరోపక్క [more]

Update: 2020-01-31 05:39 GMT

సమంత తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలు, ప్రేక్షకులకు నచ్చే కథలు కలిగిన సినిమాలే చేస్తూ.. మెల్లమెల్లగా సినిమాలు తగ్గించుకుంటుంది. ఓ పక్క అమెజాన్ వెబ్ సీరీస్, మరోపక్క బుల్లితెర ఎంట్రీ. అలాగే సమంత కూడా సినిమాలు తగ్గించుకోవడానికి మరో కారణం సోషల్ మీడియాలో వినబడుతుంది. ఎప్పుడూ గ్లామర్ డాల్ గా కనబడే సమంత తల్లికావాలని ఆలోచన చేస్తుందట. అందుకే సినిమాలు తగ్గించుకుంటూ పోతుందని.. కాకపోతే సమంత మరోపక్క బిజినెస్ ఉమన్ గా వ్యాపారరంగంలోకి కూడా దిగబోతుందట. ఇప్పటికే నిర్మాతగా మారబోతుందనే న్యూస్ ఉంది. ఇప్పుడు కొత్తగా బిజినెస్ ప్లాన్స్ వేస్తుందట సమంత.

సమంత సినిమాలు తగ్గించుకుని.. తల్లి కాబోయే టైం కి ఇలా బిజినెస్ మొదలు పెట్టి… బిజినెస్ ఉమన్ గా మారాలని అనుకుంటుందట. అయితే సమంత ఇప్పుడు కొత్తగా స్కూల్ బిజినెస్ మొదలెట్టబోతుందట. ప్రీ స్కూల్, నర్సరీ, ప్రైమరీ స్కూల్, పీపీ-2 స్కూళ్లను అల్ట్రా మోడరన్ గా మొదలెట్టాలని చూస్తుందట. ఈ స్కూల్ బిజినెస్ లో భారీగా ఇన్వెస్ట్ చెయ్యడానికి సమంత సిద్దమవుతుందట. ఈ స్కూల్ బిజినెస్ కోసం సమంత ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుందట. ఈ స్కూల్స్‌లో పిల్లలకు పర్యావరణంపై కూడా అవగాహన కల్పిస్తారట. ఇక ఈ స్కూల్స్ లో కొత్తకొత్త కోర్సులు ప్రవేశ పెట్టడమే కాకుండా హైదరాబాద్ లోనే నెంబర్ వన్ స్కూల్స్ గా తన స్కూల్స్ ని మార్చాలని సమంత కంకణం కట్టుకుందని అంటున్నారు.

Tags:    

Similar News