జబర్దస్త్ కి కష్టాలు మొదలయ్యాయా?

నాగబాబు వెళ్ళిపోయినా.. జబర్దస్త్ ని రోజా మేడం సూపర్ గా హ్యాండిల్ చేస్తుంది అండి, ఇక రోజా ఆధ్వర్యంలో జబర్దస్త్ కి నాగబాబు ఉన్నపుడు ఎంత టీఆర్పీ [more]

Update: 2019-12-18 07:12 GMT

నాగబాబు వెళ్ళిపోయినా.. జబర్దస్త్ ని రోజా మేడం సూపర్ గా హ్యాండిల్ చేస్తుంది అండి, ఇక రోజా ఆధ్వర్యంలో జబర్దస్త్ కి నాగబాబు ఉన్నపుడు ఎంత టీఆర్పీ రేటింగ్ వచ్చిందో ఇప్పుడు కూడా ఆ రేంజ్ రేటింగ్ కి జబర్దస్త్ కి వస్తుంది అని, సో నాగబాబు వెళ్ళిపోయినా జబర్దస్త్ కి నష్టం లేదన్నారు. అయితే ఇప్పుడు రోజా తో పాటుగా జేడ్జ్ సీట్ లో కూర్చునే రెండో జడ్జ్ పై రోజుకో న్యూస్ వినబడుతుంది. జబర్దస్త్ కి ఏ యంగ్ హీరో నో వచ్చి తన సినిమా ప్రమోషన్స్ తో పాటుగా కాస్త ఎంటర్టైన్ చేస్తుంటే…. ఎక్స్ట్రా జబర్దస్త్ కి మాత్రం ఒక వారం రోజా సోలోగా రెండు వారలు అలీ తో పాటుగా కూర్చున్న రోజాకి ఇప్పుడు మళ్ళీ అలీ వెళ్లిపోవడంతో.. తన పక్కన కూర్చీబోయే జడ్జ్ విషయంలో రోజా మధన పడుతుందట. ఇక ఈ వారం రోజా పక్కన అనసూయ జడ్జ్ గా కూర్చోబోతుందట.

అనసూయ యాంకర్ కం జడ్జ్ గా ఈ వారం అయితే కూర్చుంటుంది. కానీ తర్వాత ఎవరు అనే దానిపై ఇంకా మల్లెమాల నుండి సస్పెన్స్ వీడడం లేదు. మరోపక్క పోసాని కృష్ణ మురళి జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ జడ్జ్ గా కాదు.. స్కిట్స్ లో కమేడియన్స్ కి సపోర్ట్ గా పోసాని కూడా టీం లో హడావిడి చేస్తున్నాడు. మరి రెండో పర్మినెంట్ జడ్జ్ ని తెచ్చేలోపల అన్ని విషయాలను రోజా చూసుకోవడం కష్టమంటున్నారు. ఇక జబర్దస్త్ బాధ్యతంతా నెత్తిన పడడంతో.. ఇప్పుడు రోజా అటు రాజకీయాలతోను ఇటు జబర్దస్త్ బాధ్యతలతోను సతమతవుతుందట.

Tags:    

Similar News