బాబు ప్లేస్ కి ఆయనైతే కరెక్ట్ అంటున్న రోజా?

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోవడం, జబర్దస్త్ ఎలా మొదలైంది, ఎలా సక్సెస్ అయ్యిందో చెబుతూ వీడియోస్ విడుదల చెయ్యడం జరుగుతూనే ఉంది. మరోపక్క రోజా జబర్దస్త్ జడ్జ్ [more]

Update: 2019-11-30 05:15 GMT

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకోవడం, జబర్దస్త్ ఎలా మొదలైంది, ఎలా సక్సెస్ అయ్యిందో చెబుతూ వీడియోస్ విడుదల చెయ్యడం జరుగుతూనే ఉంది. మరోపక్క రోజా జబర్దస్త్ జడ్జ్ గా చక్రం తిప్పడం, కొంతమంది జబర్దస్త్ నుండి వెళ్ళిపోయినా వారి ప్లేస్ల లను ఎలా భర్తీ చెయ్యాలో అనే ఆలోచనలో ఉందట రోజా మేడం. మరోపక్క జబర్దస్త్ కమెడియన్స్ పెళ్లాలని కూడా స్టేజ్ మీదకి దింపిన రోజాకి జబర్దస్త్ ని హ్యాండిల్ చేయడం తలకి మించిన భారంగా మారిందట. నాగబాబు ఉన్నప్పుడు కమెడియన్స్ ని ఏకతాటి మీద నడిపించడం దగ్గరనుండి.. వాళ్లకు సలహాలు అవి ఇస్తూ జబర్దస్త్ ని హ్యాండిల్ చేసేవాడు. కానీ నాగబాబు వెళ్లిపోవడం రోజా ఒంటరిగా ఇవన్నీ చెయ్యడం కష్టంగా మారిందట.

అయితే రోజా జబర్దస్త్ జడ్జ్ గా ఉంటూ.. మరో జడ్జ్ కూడా ఉంటే బావుంటుందని మల్లెమాల యాజమాన్యంతో మట్లాడుతుండట. అయితే మల్లెమాల వాళ్ళు ఎప్పటినుండో రెండో జడ్జ్ ని తెచ్చే పనిలో ఉన్నారు. అలీ కానీ, బండ్ల కానీ వస్తారన్నారు.అయితే తాజాగా వైసిపిలోకి కాలు పెట్టిన అలీ అయితే తన పక్కన జడ్జ్ కింద బావుంటుందని.. అలీ ని గట్టిగా సంప్రదించమని మల్లెమాలకు సిఫార్సు చేస్తుందట రోజా. అటు రాజకీయంగానూ, ఇటు జడ్జ్ గాను అలీ అయితే తనకు సహాయంగాను, ఈ షో కి కొత్త క్రేజు వస్తుందని రోజా చెబుతుందట.

Tags:    

Similar News