అప్పుడే అలసిపోతే ఎలా అమ్మడు ?

కన్నడ నుండి కెరటంలా దూసుకొచ్చిన రష్మిక మందన్న తెలుగులో పట్టుమని నాలుగైదు సినిమాలు చెయ్యలేదు అప్పుడే అలిసిపోతున్నానని చెబుతుంది. అంటే రెండు మూడు సినిమాలను ఓకె టైం [more]

Update: 2019-12-07 05:02 GMT

కన్నడ నుండి కెరటంలా దూసుకొచ్చిన రష్మిక మందన్న తెలుగులో పట్టుమని నాలుగైదు సినిమాలు చెయ్యలేదు అప్పుడే అలిసిపోతున్నానని చెబుతుంది. అంటే రెండు మూడు సినిమాలను ఓకె టైం లో మ్యానేజ్ చెయ్యడం కష్టమని ఈ భామ భావన అన్నమాట. మరి పూజ హెగ్డే గతంలో అరవింద సమేత, మహర్షి, బాలీవుడ్ హౌస్ ఫుల్ 4, ప్రభాస్ తో జాన్ షూటింగ్ ని ఒకే టైం లో చేసింది. అంటే ఉదయం ఓ హీరో, సాయంత్రం ఓ హీరో, రాత్రికి మరో హీరో అన్నట్టుగా ఎక్కే ఫ్లైట్ ఎక్కి దిగే ఫ్లైట్ దిగింది కూడా. అయినా చేతిలో సినిమాలున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే సామెతని పూజ హెగ్డే పక్కాగా ఫాలో అయ్యింది. కానీ రష్మిక అలా కాదు. ప్రస్తుతం స్టార్ హీరోలకే నా డేట్స్ అంటుందట. మరో పక్క పారితోషకం డబుల్ చేసిందనే న్యూస్. అది నిజమే.. డిమాండ్ ఉన్నప్పుడు అడిగితె తప్పేమిటి అంటుంది. మరోపక్క యంగ్ అండ్ చిన్న హీరోల సినిమాలు రిజెక్ట్ చేస్తుందనే ప్రచారం ఉంది.

తాజాగా ఒకదానిమీద మరొక సినిమా చేస్తూ త్వరగా అలిసిపోతున్న అంటూ కబుర్లు చెబుతుంది. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ సినిమా చేస్తున్న రష్మిక, నితిన్ తో భీష్మ సినిమాలో నటిస్తుంది. మరోపక్క నాగ చైతన్య – పరశురామ్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటున్నారు. క్లారిటీ లేదు. బన్నీ – సుక్కు సినిమాలో రష్మిక నే హీరోయిన్. మరోపక్క తమిళనాట రష్మిక నటిస్తుంది. అయితే ఇలా ఖాళీ లేకుండా సినిమాలు చేస్తున్నందుకు గాను తానూ త్వరగా అలిసిపోయి నీరస పడిపోతున్నట్లుగా రష్మిక చెబుతుంది. అందుకే ఈ సినిమాలు అయ్యాక కాస్త విశ్రాంతి తీసుకుంటా అంటుంది. మరి కెరీర్ కి ఏమాత్రం జాలి బ్రేకిచ్చినా.. తర్వాత మళ్ళీ కష్టం అనే విషయం రష్మిక కు తెలియదంటారా..!

Tags:    

Similar News