పారితోషకం గురించి కాదు.. పాత్రకి న్యాయం చెయ్యలేక

నాలుగు సినిమాలు చేతిలో ఉండేసరికి… రష్మిక మందన్న కి పొగరు పెరిగింది, స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది, పారితోషకం పెంచేసింది అనే ప్రచారం ఓ రేంజ్ లో [more]

Update: 2019-12-08 07:58 GMT

నాలుగు సినిమాలు చేతిలో ఉండేసరికి… రష్మిక మందన్న కి పొగరు పెరిగింది, స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది, పారితోషకం పెంచేసింది అనే ప్రచారం ఓ రేంజ్ లో జరిగింది. మహేష్, నితిన్, అల్లు అర్జున్ సినిమాలలో నటిస్తున్నా రష్మిక ఇక యంగ్ అండ్ చిన్న హీరోలకు దొరకదని అన్నారు. ఇక పారితోషకం విషయంలో చాలా సినిమాను రిజెక్ట్ చేస్తుంది అంటే.. దానికి రష్మిక డిమాండ్ ఉంటేనే కదా.. పారితోషకం డిమాండ్ చేసేది అంది. తాజాగా బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ లో షాహిద్ కపూర్ సరసన సినిమా కి నో చెప్పి గాసిప్ రాయుళ్ల నోటికి పని చెపింది. పారితోషకం కారణంగానే రష్మిక మంచి సినిమా వదిలేసింది అని అన్నారు.

అయితే అన్ని విషయాలకు పారితోషకానికి లింక్ చెయ్యకండి.. నేను పారితోషకం సరిపోక జెర్సీ రీమేక్ వదల్లేదు, నాలుగు సినిమాలు చేతిలో ఉండడంతో డేట్స్ ఖాళీ లేక నేను జెర్సీ బాలీవుడ్ రీమేక్ కి నో చెప్పాల్సి వచ్చింది అంటూ.. గాసిప్ రాయుళ్ల మీద ఫైర్ అవుతుంది రష్మిక మందన్న. నాలుగు సినిమాల్లో ఖాళీ లేకుండా గడుపుతున్న నేను మరొక సినిమా ఒప్పుకునే స్థితిలో లేను.. అలాగే జెర్సీ సినిమాలో హీరోయిన్ పాత్ర సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ఒకవేళ నేను ఒప్పుకుని ఆ పాత్రకి న్యాయం చెయ్యలేకపోతే కష్టం కనకనే ఒప్పుకోలేదు అంటుంది.

Tags:    

Similar News