నిన్నటి వరకు రష్మిక.. రష్మిక అన్నోళ్లు.. ఇప్పుడు

ఛలో, గీత గోవిందం హిట్స్ తర్వాత రష్మిక మందన్న పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. గీత గోవిందం హిట్ తర్వాత కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక [more]

Update: 2019-08-24 06:08 GMT

ఛలో, గీత గోవిందం హిట్స్ తర్వాత రష్మిక మందన్న పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. గీత గోవిందం హిట్ తర్వాత కెరీర్ ముఖ్యమని భావించిన రష్మిక ఎంగేజ్మెంట్ ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. దేవదాస్ సినిమా యావరేజ్ అయినా.. డియర్ కామ్రేడ్ తో హిట్ కొట్టాలనుకుంది. విజయ్ దేవరకొండ తో కలిసి భీభత్సంగా ప్రమోషన్స్ లోను పాల్గొంది. కానీ డియర్ కామ్రేడ్ సినిమా రష్మిక కే కాదు విజయ్ దేవరకొండ క్రేజ్ కి బ్రేకులు వేసింది. ఇక విజయ్ దేవరకొండ తదుపరి సినిమాలు ఇప్పటికే డైలమాలో పడ్డాయి. కానీ రష్మిక, మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ అనే బిగ్ ప్రాజెక్ట్ లో నటించడమే కాదు.. నితిన్ తో భీష్మ లో కూడా నటిస్తుంది.

అందంగా ఉన్నప్పటికీ.. గ్లామర్ లుక్స్ అంతంతమాత్రంగా వున్నా రష్మిక మందన్న కి లక్కు బాగా కలిసొచ్చి వరుస హిట్స్ పడ్డాయి. అందుకే మహేష్ లాంటి హీరో చూపు రష్మిక మీద పడింది. అయితే డియర్ కామ్రేడ్ కి ముందు రష్మిక జపం చేసిన చాలామంది దర్శక నిర్మాతలు డియర్ కామ్రేడ్ తర్వాత రష్మిక మందన్న గురించి లైట్ తీసుకున్నారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మరింది. డియర్ కామ్రేడ్ లో లిల్లీ గా సూపర్ గా నటించినా.. ఆ సినిమా ప్లాప్ ఎఫెక్ట్ హీరో విజయ్ తో పాటుగా రష్మిక మీద కూడా సరిసమానంగా పడిందంటున్నారు. కాబట్టే రష్మిక కి అవకాశాలు తగ్గాయంటున్నారు. సరిలేరు నీకెవ్వరూ, భీష్మల్లో ఏది హిట్ అయినా రష్మిక మల్లి ఫామ్ లోకొస్తుంది అంటున్నారు. ఎలాగూ గ్లామర్ షో చెయ్యదు, అసలే ఒక ప్లాప్ ఉంది ఎందుకులే అంటున్నారట హీరోలు కూడా. మరి రష్మిక కి నటనలో ఫుల్ మార్కులు పడినా గ్లామర్ పరంగా కాస్త నాసే. ఇతర హీరోయిన్స్ లా స్కిన్ షో చెయ్యదు. ఒకవేళ రష్మిక చేసినా ఆమెలోని గ్లామర్ యాంగిల్ అంతగా ఉండదు

Tags:    

Similar News