బాబుకి ఫెవర్ గానే ఎన్టీఆర్ బయో పిక్.. రుజువిదిగో

Update: 2018-09-13 06:24 GMT

బాలకృష్ణ హీరోగా.. నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు గారి బయో పిక్ ని ఎన్టీఆర్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ నట, రాజకీయ జీవితాలను ఈ ఎన్టీఆర్ బయో పిక్ లో చూపిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ... ఎటువంటి క్లారిటీ ఎవ్వరి దగ్గర లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రధారి బాలకృష్ణ అచ్చం తండ్రి ఎన్టీఆర్ పోలికల్తోనే ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక టిడిపి కి ఈ ఎన్టీఆర్ బయో పిక్ 2019 ఎన్నికలకు ఎంతో కీలకం అన్నమాదిరిగానే ఈ సినిమా ఉండబోతుందనేది ఈ సినిమా ఎనౌన్సమెంట్ అప్పటినుండి వినిపిస్తున్న టాక్. టిడిపి అంటే నారా చంద్రబాబు నాయుడుకి ఫెవర్ గానే ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఎలాగూ చంద్రబాబు ఎన్టీఆర్ కి అల్లుడే అయినప్పటికీ... చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వాళ్ళలో ఉన్నాడు. ఎన్టీఆర్ నుండి సీఎం పదవిని కైవసం చేసుకున్న బాబు ఆయన పతనానికి కారణమంటారు ప్రత్యర్ధులు.

అయితే చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంటుందో లేదో తెలియదు కానీ... ఇప్పుడు చంద్రబాబు గా రానా లుక్ మాత్రం అదరగొట్టేస్తుంది. వినాయకచవితి స్పెషల్ పోస్టర్ గా ఎన్టీఆర్ లో రానా అలియాస్ చంద్రబాబు లుక్ వదిలింది ఎన్టీఆర్ టీం. అచ్చం చంద్రబాబు 1980 లో ఎలా వుండేవాడో.. ఆ మాదిరిగా రానా లుక్ ఉంది. గెడ్డం లేని చంద్రబాబు గా రానా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 1982లో చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు టీడీపీ చేతిలో ఓడిపోయి.. ఆ తర్వాత తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుని.. 1984లో జరిగిన ఆగస్టు సంక్షోభం నుంచి.... నాదెండ్ల కుట్ర నుంచి పార్టీని కాపాడి తన పొలిటికల్ స్టామినాను రుజువు చేసుకుని ఎన్టీఆర్ కి కుడి భుజంగా మారడంలాంటి విషయాలన్నీ ఏ ఎన్టీఆర్ బయో పిక్ లో ఉంటాయనే విషయం ఇప్పుడు వదిలిన చంద్రబాబు నాయుడు పాత్ర రానా పిక్ తెలియజేస్తుంది.

మరి దీనిని భట్టి ఎన్టీఆర్ నట జీవితంతో పాటుగా రాజకీయరంగేట్రం.. దగ్గర్నుండి అయన తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులను గెలుచుకుని ముఖ్యమంత్రి కావడం... బాబు ఎన్టీఆర్ కి అల్లుడు కావడం... ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం వంటి విషయాలతో ఈ ఎన్టీఆర్ బయో పిక్ ఉండబోతోందనే విషయం అర్ధమవుతుంది. ఇక ఎన్టీఆర్ నిజ జీవితాన్ని కూడా తక్కువ టైం కె సెట్ చేసి మరీ ఎన్టీఆర్ వ్యక్తిగత, రాజకీయ, నట జీవితాలను బ్యాలెన్సుడ్ గా ఈ సినిమాలో దర్శకుడు క్రిష్, బాలకృష్ణలు చూపిస్తారంటున్నారు. ఇక ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా టిడిపికి ఫెవర్ గా వుండబోతుందనేది మాత్రం వాస్తవంగానే కనబడుతుంది

Similar News