ఇది ఖచ్చితంగా గాసిప్పే

చలో తో సాలిడ్ హిట్ కొట్టిన వెంకీ కుడుములను నితిన్ పిలిచి అవకాశం ఇచ్చాడు. భీష్మ లాంటి కమర్షియల్ ఎంటెర్టైనెర్ కథ చెప్పి నితిన్ ని పడేసిన [more]

Update: 2020-02-28 06:09 GMT

చలో తో సాలిడ్ హిట్ కొట్టిన వెంకీ కుడుములను నితిన్ పిలిచి అవకాశం ఇచ్చాడు. భీష్మ లాంటి కమర్షియల్ ఎంటెర్టైనెర్ కథ చెప్పి నితిన్ ని పడేసిన వెంకీ కుడుముల భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆద్యంతం నవ్వులు పూయించిన భీష్మ సినిమా తో వెంకీ కుడుముల టాప్ లిస్ట్ లోకెళ్ళిపోయాడు. దర్శకులకుండే ద్వీతీయ విజ్ఞాన్ని చాకచక్యంగా దాటగలిసిన వెంకీ కుడుములకు ఇప్పడు భారీ ఆఫర్ వస్తున్నాయని అంటున్నారు. అందులో టాప్ హీరో, పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ కన్ను వెంకీ కుడుముల మీద పడినట్లుగా ఓ వార్త ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

రాజమౌళి తో చేస్తున్న RRR తరవాత రామ్ చరణ్ మూవీ ఇంకా పక్కా కాలేదు. ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ తో నెక్స్ట్ అంటూ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసాడు. కానీ చరణ్ అదిగో ఇదిగో అంటూ.. మెగా ఫాన్స్ ని ఊరిస్తున్నాడు తాజాగా విక్రమ్ కుమార్ కథకి రామ్ చరణ్ ఇంప్రెస్స్ అయినట్లుగా వార్తలొచ్చినా.. అది స్పష్టత లేదు. తాజాగా భీష్మ డైరెక్టర్ ని రామ్ చరణ్ పిలిపించాడని.. వెంకీ కుడుములు స్టోరీ లైన్ చెప్పమని అడిగాడని.. దానికి వెంకీ కుడుముల ఓ ఐడియా చెప్పగా… అది చరణ్ కి నచ్చి స్టోరీ డెవెలెప్ చెయ్యి సినిమా చేద్దామని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ తండ్రి సినిమా నిర్మాతగా, RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడని.. వెంకీ భీష్మ చరణ్ చూసినా వెంకీ కి కబురు పెట్టలేదని… ఈ వార్త కేవలం గాసిప్ అంటున్నారు చరణ్ సన్నహితులు.

Tags:    

Similar News