రామ్ చరణ్ తెలివైన ప్లాన్?

రామ్ చరణ్ తన తండ్రి చిరు కం బ్యాక్ మూవీస్ లాభాలను తన అకౌంట్ లో వేసుకోవచ్చనే ప్లాన్ చేసి మరీ కొణిదెల కంపెనీ స్టార్ట్ చేసాడు. [more]

Update: 2020-03-21 05:31 GMT

రామ్ చరణ్ తన తండ్రి చిరు కం బ్యాక్ మూవీస్ లాభాలను తన అకౌంట్ లో వేసుకోవచ్చనే ప్లాన్ చేసి మరీ కొణిదెల కంపెనీ స్టార్ట్ చేసాడు. తన తండ్రి చిరు సినిమాలను వరసగా నిర్మిస్తూ.. సై రా తో కాస్త ఇబ్బంది పడ్డాడు. సైరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ హిట్. కానీ మిగతా భాషల్లో ప్లాప్ అయ్యింది .ఇక ఇక్కడ హిట్ అన్నమాటే కానీ… చరణ్ కు వచ్చిన లాభాలకు కట్టినా జీఎస్టీ చూసి దిమ్మతిరిగింది. దానితో ఈసారి రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ చేసాడు. కొరటాల శివ – చిరు సినిమా కోసం మరో నిర్మాతను రంగంలోకి దింపాడు . నిరంజన్ రెడ్డి తో కలిపి చిరు ఆచార్య తీస్తున్నాడని అనుకున్నారు. కానీ కేవలం సమర్పిస్తూ.. లాభాల్లో వాటా మాత్రం తీసుకోవడమే కాదు.. ఎప్పటిలాగే చిరు పారితోషకం కూడా అందుకుంటారట. అయితే నిరంజన్ రెడ్డి బ్యాక్ బోన్ గా కొణిదెల కంపెనీ ఉంటుందట.

ఇక చరణ్ ఆచార్య లో నటిస్తే రోజుకి కోటి లెక్కన ఆచార్య కోసం చరణ్ రంగంలోకి దిగుతున్నాడట. రోజుకి కోటి చొప్పున ఎన్ని రోజులు నటిస్తే అన్ని కోట్లన్నమాట. అయితే చరణ్ మాత్రం ఆచార్య కోసం 15 రోజులు మాత్రమే నటిస్తాడట, అంటే మొత్తానికి 15 కోట్లన్నమాట. మరి చిరు పారితోషకం, లాభాల్లో వాటా, మరోపక్క చరణ్ పారితోషకం ఇలా మూడు రకాలుగా చిరు చెర్రీ ఆచార్యతో లాభపడుతున్నారు. అయితే సినిమాలో పెట్టుబడులు పెట్టి లాభాలు వెనకేసుకున్న జీఎస్టీ తో బోలెడంత వదిలించుకోవాలి అందుకే రామ్ చరణ్ మంచి ప్లాన్ చేసాడు. ఎంతైనా నిర్మాతగా, హీరోగా మంచి ప్లానింగ్ తో ఉన్నాడు.

Tags:    

Similar News