సైరా కోసం రాజమౌళి వస్తాడా?

చిరంజీవి – సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ దిగ్విజయంగా మొన్నీమధ్యనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సై రా [more]

Update: 2019-07-09 05:49 GMT

చిరంజీవి – సురేందర్ రెడ్డిల కాంబోలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ దిగ్విజయంగా మొన్నీమధ్యనే పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సై రా టీం బిజీగా వుంది. ఇండియా వైడ్ గా పలు భాషల్లో విడుదల కాబోతున్న సై రా నరసింహారెడ్డి సినిమా విషయంలో మెగా స్టార్ చిరు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎలాగూ నిర్మాత రామ్ చరణ్ #RRR సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు కాబట్టి… చిరు ఇప్పుడు సై రా విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక సై రా సినిమా రష్ ని తాను చూడడమే కాదు…. టాలీవుడ్ లోని తనకు మిత్రులైన పలువురు ప్రముఖ డైరెక్టర్స్ కి చిరు చూపించబోతున్నాడట. ఎందుకంటే వారు చూసి ఎమన్నా కరెక్షన్స్ ఉంటె చెబితే.. వాటిని ఇప్పుడే రిపేర్లు చేసుకోవచ్చని చిరు ప్లాన్.

ఇప్పటికే చిరంజీవి తనకు అత్యంత ఆప్తుడైన సత్యానంద్ ని పిలిచి సై రా నరసింహారెడ్డి రషెస్ చూపించినట్లుగా సమాచారం. ఇక త్వరలోనే రాఘవేంద్ర రావు కూడా సైరా రషెస్ చూడడానికి రాబోతున్నాడట. అయితే ప్రస్తుతం గ్రాఫిక్స్ తో టాలీవుడ్ లోనే కాదు… ఇండియా వైడ్ గా ఓ కొత్త వరవడి సృష్టించిన రాజమౌళి ని పిలిచి సై రా నరసింహారెడ్డి ని చూపించి…. సై రా కోసం రాజమౌళి ఇచ్చే సలహాలను కూడా పాటించాలని చిరు అనుకుంటున్నాడట. సై రా సినిమాలో కూడా భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. అందుకే వాటిని రాజమౌళి కి చూపించి సలహాలు సూచనలు తీసుకోవాలని చిరు అనుకుంటున్నాడట. మరి చిరు కోసం రాజమౌళి వచ్చి ఏ మాత్రం సలహాలు సై రా కోసం ఇవ్వబోతున్నాడో అనే క్యూరియాసిటీ తో మెగా అభిమానులు ఉన్నారు

Tags:    

Similar News