షాకింగ్: బాహుబలి 3 ఉండనుందా?

టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం #RRR చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్.. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు [more]

Update: 2019-08-27 07:02 GMT

టాలెంటెడ్ డైరెక్టర్ దర్శకదీరుడు రాజమౌళి ప్రస్తుతం #RRR చిత్ర షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్.. కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో నటిస్తున్న వీరిపై లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ ని కంప్లీట్ చేసారు. త్వరలోనే ఈసినిమా యొక్క షూటింగ్ బల్గెరియాలో జరగనుందని ఫిలింనగర్ టాక్. అక్కడ ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు అని తెలుస్తుంది.

ఇక ఈమూవీ వచ్చే ఏడాది జులై 30 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందని ఆల్రెడీ అధికారంగా ప్రకటించారు. మరి ఈచిత్రం తరువాత రాజమౌళి ఏ సినిమా తీయనున్నారు? పొరపాటున బాహుబలి 3 తీయనున్నాడా? ఏమో ప్రభాస్ మాటలు వింటే నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం సాహో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ ఇంటర్వ్యూ లో బాహుబలి 3 ఉంటుందా? అంటే ఉండవచ్చు అని సమాధానం చెప్పారు.

బాహుబలి రెండు పార్ట్స్ కలిపితే సగం స్టోరీ నే చెప్పగలము అని ఆయన అనడంతో బాహుబలి 3 ఉండే అవకాశం ఉందనిపిస్తుంది. మరి రాజమౌళి దగ్గర బాహుబలి 3 స్క్రిప్ట్ రెడీ గా ఉందా? అసలు రాజమౌళి పార్ట్ 3 తీయడానికి ఇష్టపడతాడా? లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News