జక్కన్నని మోసం చేశాడా?

రాజమౌళి జక్కన్నని మోసం చేశాడా? ప్రస్తుతం RRR పనులతో బిజీగా వున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ కి వెల్దామా అని కాచుకుని కూర్చున్నాడు. లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి [more]

Update: 2020-06-15 13:16 GMT

రాజమౌళి జక్కన్నని మోసం చేశాడా? ప్రస్తుతం RRR పనులతో బిజీగా వున్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ కి వెల్దామా అని కాచుకుని కూర్చున్నాడు. లాక్ డౌన్ ముగిసి షూటింగ్స్ కి అనుమతులొచ్చినా.. RRR లాంటి బిగ్ ప్రాజెక్ట్ ని సామజిక దూరం పాటిస్తూ షూట్ చెయ్యడం అసాధ్యమే. అయితే రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ విషయంలో జక్కన్నను ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మోసం చేశాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జక్కన్నకి మహాభారతం సినిమా చెయ్యాలనేది కల. అయితే అది RRR తర్వాత కావొచ్చు, లేదా రాజమౌళి చివరి చిత్రమైన కావొచ్చు. అయితే రాజమౌళి సినిమాలకి ఇప్పటివరకు కథ ని ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాదే అందిస్తున్నాడు. అయితే ఈ మహాభారతం సినిమాని అమీర్ ఖాన్ హీరోగా తెరకేక్కిన్చే ప్లాన్ కూడా ఎప్పుడో మొదలయ్యింది.

అయితే తాజాగా అమీర్ ఖాన్ మహాభారతానికి కథ అందించనున్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కే మహాభారతానికి స్క్రిప్ట్ రాసేందుకు చర్చలు జరుపుతున్నట్టుగా చెప్పి షాకిచ్చాడు. అయితే మహాభారతం ని వెబ్ సీరీస్ గా అయినా, సినిమాగా అయినా మలిచేందుకు అమీర్ ఖాన్ మహాభారతం మీద రిచెర్చ్ కూడా చేసాడు. అందుకే అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ని మహాభారతం స్క్రిప్ట్ ఇవ్వమని కోరినట్టుగా.. విజయేంద్ర ప్రసాద్ పసృతం అమీర్ తో మహాభారతం స్క్రిప్ట్ చర్చల్లో ఉన్నట్టుగా చెబుతుండడం చూస్తే రాజమౌళి కి ఆయన తండ్రిగారు హ్యాండ్ ఇచ్చి.. అమీర్ కోసం పనిచేస్తాడనిపిస్తుంది. అయితే అమీర్ ఖాన్ ది సీరీస్. రాజమౌళిది సినిమా. ఎవరి స్టయిల్ వాళ్ళది. అయినా మహాభారతం ఎవరికీ ఇష్టం వచ్చిన స్టయిల్లో వారు ప్రెజెంట్ చేస్తారు. ఎన్ని రకాలుగా అయినా ఆది తెరకెక్కించొచ్చు. అందుకే రాజమౌళి కి మరో వెర్షన్ రాసె ప్లాన్ లోనే అమీర్ ఖాన్ కి మహాభారతం స్క్రిప్ట్ కోసం రేడి అంటున్నారు విజయేంద్రప్రసాద్.

Tags:    

Similar News