రాజ్ తరుణ్ పరిస్థితి ఎలా ఉందొ చూసారా

హీరో కి హిట్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది. మార్కెట్ కూడా బావుంటుంది. అదే హీరోకి ప్లాప్ లు వరసగా పడ్డాయా.. ఇక ఆ హీరో కి ఓ [more]

Update: 2019-11-02 12:13 GMT

హీరో కి హిట్ ఉంటేనే క్రేజ్ ఉంటుంది. మార్కెట్ కూడా బావుంటుంది. అదే హీరోకి ప్లాప్ లు వరసగా పడ్డాయా.. ఇక ఆ హీరో కి ఓ బ్లాక్ బస్టర్ పడే దాకా కష్టాలే. తాజాగా రాజ్ తరుణ్ వరస ప్లాప్స్ తో ఉన్నాడు. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఇద్దరి లోకం ఒకటే సినిమాతో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే దిల్ రాజు నిర్మాణం గనక సినిమాకొచ్చిన ఢోకా లేదు కానీ.. రాజ్ తరుణ్ పరిస్తితే కాస్త ఘోరం ఉంది. ఫామ్ లో ఉన్నప్పుడు తమ చుట్టూ తిరిగే నిర్మాతలు హీరోలెం చెబితే అది చేస్తారు. అదే ఫార్మ్ కోల్పోతే మాత్రం నిర్మాత ఎలా చెబితే హీరో అలా వినాలి.

ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో అదే జరిగింది. రాజ్ తరుణ్ ఇద్దరి లోకం ఒకటే సినిమా కోసం ఎలాంటి పారితోషకమే అందుకోవడం లేదట. అంటే దిల్ రాజు ఇవ్వడం లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్ మార్కెట్ జీరో కనక. అయితే పారితోషకం ఇవ్వకపోయినా.. రాజ్ తరుణ్ కి నెలకింతని సాలరీ ఇస్తున్నాడట. అంటే రాజ్ తరుణ్ నెల జీతానికి దిల్ రాజు దగ్గర పనిచేస్తున్నాడన్నమాట. అయితే ఇద్దరి లోకం ఒకటే హిట్ అయితే గనక రాజ్ తరుణ్ కి బల్క్ పారితోషకం ఉంటుందట. లేదంటే లేదని దిల్ రాజు రాజ్ తరుణ్ కి క్లియర్ గా చెప్పడంతో రాజ్ తరుణ్ ఆ కండిషన్ కి ఒప్పుకునే ఇద్దరి లోకం ఒకటే చేసాడట

Tags:    

Similar News