దిల్ రాజు పెళ్లివెనక ‘ఆయన’ హస్తం?

ఈమధ్యన టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి ఫిలింసర్కిల్స్ లోను, ఇండస్ట్రీలోని హాట్ హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది భార్య అనితని పోగొట్టుకున్న [more]

Update: 2020-02-15 10:05 GMT

ఈమధ్యన టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి ఫిలింసర్కిల్స్ లోను, ఇండస్ట్రీలోని హాట్ హాట్ టాపిక్ అయ్యింది. గత ఏడాది భార్య అనితని పోగొట్టుకున్న దిల్ రాజు కి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ… దిల్ రాజు ఒంటరితనం ఫీలవుతూ రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడని, అది కూడా సన్నిహితులు చెప్పారన్న కారణంతోనే రెండో పెళ్ళికి సుముఖత చూపాడని అన్నారు. అయితే దిల్ రాజు రెండో పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది కానీ.. దిల్ రాజు నుండి మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు, చేసుకుంటే తప్పేముంది అనే సమాధానం రాకపోయేసరికి దిల్ రాజు మల్లి పెళ్లి ఫిక్స్ అనుకుంటున్నారు.

అయితే దిల్ రాజు రెండో పెళ్లి వెనుక మరొకరి హస్తం ఉందని.. దిల్ రాజు సన్నిహితుడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ దిల్ రాజుని మల్లి పెళ్ళికి ఒప్పించాడనే టాక్ నడుస్తుంది. ప్రకాష్ రాజ్.. దిల్ రాజుకి అర్ధమయ్యేలా చెప్పాడని, ఈ వయసులో తోడు అవసరమని దిల్ రాజుని రెండో పెళ్ళికి ఒప్పించడంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించినట్లుగా ఫిలింనగర్ టాక్. తాను కూడా 50 ఏళ్ళు అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అని.. ఇప్పుడు నువ్వు చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని , అంతే కాదు.. లోకంలో చాలామంది రెండో పెళ్లి చేసుకుంటున్నారని.. నువ్వు చేసుకుంటే తప్పేం లేదని దిల్ రాజుకి ప్రకాష్ రాజ్ చేసిన హిత బాధతోనే దిల్ రాజు పెళ్లికి ఒప్పుకున్నాడంటున్నారు

Tags:    

Similar News