పవన్ సరసన ఫెడవుట్ హీరోయిన్?

క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా జనవరి 27 నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, ఆ సినిమా 27 నే మొదలు కాబోతుంది అంటూ [more]

Update: 2020-01-22 06:21 GMT

క్రిష్ – పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమా జనవరి 27 నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, ఆ సినిమా 27 నే మొదలు కాబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియా ని కమ్మేసింది. పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడని అంటున్నారు. క్రిష్ కూడా పవన్ క్రేజ్ కి తగ్గట్టుగా ఓ కథని తయారు చేసాడని, ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగ గా కనిపించబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ తో ఇప్పుడు నటించబోయే హీరోయిన్స్ విషయంలో పిచ్చ క్యూరియాసిటీ నడుస్తుంది.

పింక్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి అంజలి, నివేత థామస్, మల్లేశం ఫేమ్ అనన్య లు నటిస్తున్నారు. ఇక క్రిష్ సినిమాలో పవన్ సరసన ఫెడవుట్ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ పేరు వినబడుతుంది. గ్లామర్ తో అందాలు ఆరబోస్తూ కిందామీదా పడుతున్న ప్రగ్యజైస్వాల్ కి అవకాశాలు ఇచ్చే నాధుడు లేకపోయినా.. క్రిష్ తో ఉన్న సన్నహిత సంబంధాల వలన పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రగ్య జైస్వాల్ కి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడనే న్యూస్ మొదలైంది. అయితే క్రిష్ – పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోయిన్‌గా అంతగా ప్రయారిటీ ఉండకపోవడంతో… ప్రగ్యాకు పవన్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ దాదాపు ఖాయమైనట్టే అనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News