నందమూరి మోక్షజ్ఞ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం త్వరలోనే అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ని పలు సినిమా ప్రమోషన్స్ అప్పుడు మీ [more]

Update: 2019-06-09 09:25 GMT

నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం త్వరలోనే అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ని పలు సినిమా ప్రమోషన్స్ అప్పుడు మీ కొడుకు ఎంట్రీ ఎప్పుడు అని అడిగితే త్వరలోనే త్వరలోనే అని చెప్పుకుంటూ వచ్చేవాడు. కానీ సరైన డేట్ మాత్రం చెప్పలేదు.

అందుకు సంబంధించి మోక్షజ్ఞ కూడా వెయిట్ లాస్ అవ్వడం…బాడీ ని బిల్డ్ చేయడం…యాక్టింగ్ నేర్చుకోవడం…డాన్స్ నేర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే…తనకు వ్యాపారాల్లో రాణించాలని ఉందని, హీరో కావడంపై ఆసక్తి లేదని నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ స్పష్టంగా చెప్పేశాడన్న వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో వైరల్ అవుతుంది.

దాంతో నందమూరి అభిమానులంతా ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. అయితే, తండ్రి బలవంతం మీదే మోక్షజ్ఞ ఈ క్లాస్ లకు హాజరయ్యాడని, తిరిగి వచ్చి, తన రెగ్యులర్ కార్యకలాపాల్లోనే నిమగ్నం అయ్యాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఓ ఆంగ్ల దినపత్రికలో ‘మోక్షజ్ఞ కేరాఫ్ కాఫీ షాప్’ అంటూ ప్రత్యేక కథనం సైతం ప్రచురితమైంది. మరి మోక్షజ్ఞ గురించి వస్తున్నా వార్తల్లో ఎంతవరకు నిజముందో వారికే తెలియాలి. మరి దీనిపై బాలయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News