డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్…ఇద్దరు హీరోస్ పండుగ

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ మూవీ రిజల్ట్ గురించి చర్చ జరుగుతుంది. గీత గోవిందం సినిమాతో 60 కోట్లు క్లబ్ లో చేరిన విజయ్ [more]

Update: 2019-07-28 13:25 GMT

విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ మూవీ రిజల్ట్ గురించి చర్చ జరుగుతుంది. గీత గోవిందం సినిమాతో 60 కోట్లు క్లబ్ లో చేరిన విజయ్ డియర్ కామ్రేడ్ తో కూడా ఆ మార్క్ ని చాలా అవలీలగా చేరుకుంటాడు అని అంత భావించారు. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే జరిగేది కానీ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది.

40 కోట్ల మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోస్ డియర్ కామ్రేడ్ సినిమా రిజల్ట్ ఏమి అవుతుందో అని టెన్షన్ పడ్డారు కానీ ఇప్పుడు రిలాక్స్ అయ్యారు అని టాక్ వస్తుంది. మరి వాళ్ళు అలా టెన్షన్ పడ్డారో లేదో తెలియదు కానీ వీటి గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. నిజానికి గతంలో విజయ్ స్టార్ డమ్ గురించి జరిగిన చర్చల్లో నితిన్ – నిఖిల్ లాంటి హీరోల పేర్లు బయటికి వచ్చాయి. అప్పుడు వాళ్ళు అలాంటిది ఏమి లేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ మరోసారి ఇద్దరు హీరోస్ పేర్లు రావడం కొసమెరుపు. ఇటువంటి అన్ని టాలీవుడ్ లో మాములే కానీ ఈసినిమా రిజల్ట్ ఏంటో ఈ వీకెండ్ లో తేలిపోనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏదో అలా అలా నడుస్తున్న ఈసినిమా ఓవర్సీస్ లో అదేవిధంగా నడుస్తుంది.

Tags:    

Similar News