సరిలేరు కి బ్రేక్..?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా పనులతో బిజీగా ఉంటాడు అనుకుంటే.. ఎప్పటిలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం హైదరాబాద్ నుండి చెక్కేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా [more]

Update: 2019-12-28 05:51 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా పనులతో బిజీగా ఉంటాడు అనుకుంటే.. ఎప్పటిలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం హైదరాబాద్ నుండి చెక్కేస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసి.. మహేష్ తన డబ్బింగ్ ని కూడా పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఫ్యామిలీ టైం అంటూ ఎగిరిపోతున్నాడు. ఇలా టైం ఉంటె.. అలా ఫ్యామిలీ తో వెకేషన్స్ ని ఎంజాయ్ చేసే మహేష్ బాబు తాజాగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఆర్ధిక రాజధాని ముంబై వెళ్ళబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. మరి మహేష్ ముంబై లో న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ అంటే.. అక్కడ బాలీవుడ్ ప్రముఖులతో కూడా మీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మహేష్ భార్య నమ్రత ముంబై పిల్లే కదా..

ఎప్పుడూ న్యూయార్క్, స్విస్, లండన్ అంటూ వెళ్లే మహేష్ ఈసారి ఫ్యామిలీతో విదేశాలకు ఎగరకుండా ముంబై లో ప్లాన్ చేసుకోవడం మాత్రం మహేష్ ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ముంబై వెళ్ళడానికి సిద్దమవుతున్న మహేష్ ఫ్యామిలీ.. డిసెంబర్ 31 న న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని.. జనవరి 3 న హైదరాబాద్ చేరుకుంటాడట. మరి ఈలోపు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ పోస్ట్ ప్రొడక్షన్ ఓ కొలిక్కి తెచ్చి.. మహేష్ వచ్చాక ప్రమోషన్స్ మొదలెడతాడట. ఎలాగూ జనవరి 5 సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్.. తర్వాత మహేష్ పర్సనల్ ఇంటర్వూస్ ఇలా సరిలేరు విడుదల టైం కి సినిమాపై భారీ క్రేజ్ పెంచే ఏర్పాట్లలో టీం ఉంది.

Tags:    

Similar News