సర్కారు వారి పాట స్టోరీ ఇదేనా?

మహేష్ – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమా కథ గురించి ఎప్పుడో [more]

Update: 2020-12-09 07:25 GMT

మహేష్ – పరశురామ్ కాంబోలో తెరకెక్కబోతున్న సర్కారు వారి పాట జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సినిమా కథ గురించి ఎప్పుడో సోషల్ మీడియాలో ఓ కథనం ప్రచారం లోకొచ్చింది. సోషల్ మీడియా కథనం ప్రకారం సర్కారు వారి పాట కథ ని మీరే చూడండి. ఈ సినిమాలో హీరో రూపాయితోనే డబ్బు సంపాదించాలనే కసితో ఉంటాడట. మరి పరశురామ్ మహేష్ సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ లోనే రూపాయి, డాలర్, మహేష్ రఫ్ లుక్ చూపించి కథపై క్లారిటీ ఇచ్చేసాడు. అందులోను సర్కారు వారి పాట బ్యాంక్స్ చుట్టూ తిరిగే కథ. బ్యాంకు లకు డబ్బు ఎగ్గొట్టి పారిపోయిన బడా బాబుల పని పట్టె కేరెక్టర్ లో మహేష్ కనిపిస్తున్నాడు.

రూపాయి రూపాయి పోగేసే క్రమంలో.. హీరో డబ్బు విలువ బాగా తెలిసినాడు కావడంతో ప్రతి రూపాయి లెక్కే, ఆ రూపాయితోనే హీరో జీవితం మొదలు కావడంతో ఆ రూపాయితో కోట్లు సంపాదించాలనే కసితో హీరో పెరిగి పెద్దవాడవుతాడట. అది కూడా పద్దతిగా న్యాయంగా సంపాదించాలనే కసితో హీరో ఉంటాడట. అందులో భాగంగానే బ్యాంకులకు డబ్బు ఎగ్గొట్టిన బడా బాబుల పని పడతాడట హీరో. ఇది సర్కారు వారి పాట స్టోరీ అంటున్నారు. సినిమా మొత్తం డబ్బు, రూపాయి చుట్టూనే తిరుగుతుందట. సో మహేష్ ఆ డబ్బు ఎలా సంపాదించాడో అనేది పరశురామ్ ఎంటెర్టైమెంట్ తో కలిపి చూపించబోతున్నాడట.

Tags:    

Similar News