అల’ కన్నా ‘సరిలేరు’ కే క్రేజ్ ఎక్కువా?

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాతి బరిలోకి దిగుతున్నాయి. అయితే సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల విషయంలో క్రేజ్ [more]

Update: 2020-01-09 06:12 GMT

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరూ సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాతి బరిలోకి దిగుతున్నాయి. అయితే సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల విషయంలో క్రేజ్ మాత్రం ఒకేలా కనబడుతుంది. అల్లు అర్జున్ – మహేష్ ల సినిమాలపై ఫాన్స్ కూడా పోటాపోటీగా ఉన్నారు. ఇక మొదటినుండి అన్ని విషయాల్లో పోటీపడుతున్న ఈ రెండు సినిమాల జోరు బుక్ మై షో దగ్గర బయటపడింది. సరిలేరు నీకెవ్వరూ – అల వైకుంఠపురములో సినిమాల ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల బుకింగ్స్ లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా టికెట్స్ మాత్రం… ఇలా పెడుతుంటే అలా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

అందులో మహేష్ సినిమా పక్కా మాస్, కామెడీ ఎంటర్టైనర్‌లా కనిపిస్తుండటం, అల్లు అర్జున్ కన్నా ఒకరోజు ముందుగా సరిలేరు నీకెవ్వఁరు సినిమా విడుదల కావడంతో.. ఈ సినిమా టికెట్స్ మాత్రం బుక్ మై షో లో దొరకడం లేదు. మల్టిప్లెక్స్ కన్నా ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లో సరిలేరు జోరు కనబడుతుంది. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా టికెట్స్ బాగానే తెగుతున్నప్పటికీ.. సరిలేరు నీకెవ్వరూ ఆన్ లైన్ బుకింగ్ మాత్రం జోరుగా సాగుతుంది. మహేష్ సరిలేరు టాక్ యావరేజ్ పడిందా.. అల వైకుంఠపురములో జోరు మాములుగా ఉండదు.. అసలే ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో.. సంక్రాతి సీజన్ లో ఫ్యామిలీస్ పక్కాగా ఫ్యామిలీ ఎంటెర్టైనెర్స్ ని కోరుకుంటారు కాబట్టి.. అల దూకుడు అప్పుడు మొదలవ్వొచ్చు.

Tags:    

Similar News