పవన్ చిందులేస్తున్నాడట

పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ బిజీ గా వున్నా టైం లో గుట్టుచప్పుడు కాకుండా సినిమాలు చేసుకుందామనుకున్నాడు. పింక్ రీమేక్ విషయం దిల్ రాజు ప్రకటించడం చేసినా.. పవన్ [more]

Update: 2020-02-06 07:17 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాలంటూ బిజీ గా వున్నా టైం లో గుట్టుచప్పుడు కాకుండా సినిమాలు చేసుకుందామనుకున్నాడు. పింక్ రీమేక్ విషయం దిల్ రాజు ప్రకటించడం చేసినా.. పవన్ మాత్రం సినిమాలపై పెదవి విప్పలేదు. కానీ పింక్ రీమేక్ షూటింగ్ లో పవన్ పాల్గొన్న రోజే పింక్ సెట్స్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకవడంతో.. షాకయినా పవన్ కళ్యాణ్ దిల్ రాజుని పిలిచి చీవాట్లు పెట్టాడని అన్నారు. ఎంత బడ్జెట్ అన్నదికాదు.. ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నామో తెలియాలి అని దిల్ రాజు కి పవన్ క్లాస్ పీకినట్లుగా వార్తలొచ్చాయి.

ఇక రెండు రోజుల క్రితం లాయర్ సాబ్ పవన్ కళ్యాణ్ పీక్స్ లో చెప్పిన డైలాగ్ వొకటి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, వెంటనే టీం దాన్ని డిలేట్ చేయించినా.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో పవన్ ఇప్పుడు నిర్మాతల మీద కస్సుబుస్సులాడుతున్నాడట. ఇలా అయితే కష్టం అంటూ దిల్ రాజుకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. పవన్ కళ్యణ్ కి కోపమొస్తే.. విషయం ఎక్కడిదాకా అయినా వెళుతుందనేది దిల్ రాజు కి ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది అనుకుంటా. మరోసారి ఇలాంటి ఫొటోలు, వీడియోలు బయటికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయంటూ పవన్ ప్రొడక్షన్ టీంకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం

కేవలం దిల్ రాజు సినిమాకే కాదు.. క్రిష్ తో చేస్తున్న సినిమా విషయంలోనూ పవన్ కాస్త సీరియస్ గా ఉన్నాడని అంటున్నారు.సెట్స్ లో ఫోన్స్ కానీ, ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలను అనుమతించొద్దంటూ పవన్ అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు పవన్ చానళ్లకు సినిమా చేయడంతో.. ఆ సినిమా కి సంబందించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతుంది . మరి పవన్ సైలెంట్ గా పనికానిద్దామంటే.. ఇప్పుడు అది కాస్త పబ్లిక్ అవడంతో.. పవన్ పింక్ రీమేక్ సెట్స్ లో చిందులేస్తున్నాడట.

Tags:    

Similar News