జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ చరణ్ ను ఓ కోరిక కోరింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా రెగ్యులర్ గా [more]

Update: 2019-08-29 08:33 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా రెగ్యులర్ గా రామ్ చరణ్ సల్మాన్ ని కలుస్తూ ఉంటాడు. ఆ టైములో సల్మాన్ ఫ్రెండ్ అయినా శ్రీలంక సుందరి జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ చరణ్ కు పరిచయం అయింది.

ఈమె తెలుగులో అవకాశాలు కోసం చరణ్ నే నమ్ముకుంది. రీసెంట్ గా రామ్ చరణ్ ముంబై కి వెళ్ళినప్పుడు జాక్వెలీన్‌ అతడిని కలిసి చాలా సేపు ముచ్చటించిందట. సాహో రిలీజ్ తరువాత తనకు తెలుగు, తమిళ, కన్నడ భాషలు నుండి అవకాశాలు వస్తాయని అప్పుడు చరణ్‌ పీఆర్‌ టీమ్‌ ద్వారా తనని సౌత్‌లో ప్రమోట్‌ చేయాలని కోరిందట.

ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోస్ తో చేసినప్పటికీ పెద్దగా రెమ్యూనరేషన్స్ ఆశించదు కనుక ఆమెకు సౌత్ లో ఆఫర్స్ వచ్చే అవకాశముంది. సాహూలోఈ బ్యూటీ ప్రభాస్ తో కలిసి ఓ సాంగ్ చేసింది.

Tags:    

Similar News