అక్కడనుండి కూడా నాగబాబు ఎగ్జిట్ అవుతున్నాడా?

జబర్దస్త్ లో ఏడేళ్లు నవ్వులు పూయించిన నాగబాబు.. మల్లెమాల మీద ఫైర్ అవుతూ జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యి జీ ఛానల్ లో అదిరింది ప్రోగ్రాం లో [more]

Update: 2020-01-09 07:37 GMT

జబర్దస్త్ లో ఏడేళ్లు నవ్వులు పూయించిన నాగబాబు.. మల్లెమాల మీద ఫైర్ అవుతూ జబర్దస్త్ నుండి ఎగ్జిట్ అయ్యి జీ ఛానల్ లో అదిరింది ప్రోగ్రాం లో తేలాడు. అదిరింది ప్రోగ్రాం లో నాగబాబు జేడ్జ్ గా చంద్ర, ఆర్పీ, వేణు, ధనరాజ్ లతో స్కిట్స్ చేయిస్తూ నవ్విస్తున్నాడు. అయితే ఎన్నో అంచనాల మధ్యన మొదలైన అదిరింది షో కి మల్లెమాల అడుగడుగునా అడ్డం పడుతుంది. అదిరింది షో టైం లో జబర్దస్త్ హిట్ స్కిట్స్ ప్రసారం చేస్తూ నాగబాబు కి నిద్ర లేకుండా చేస్తుంది. జబర్దస్త్ పాత స్కిట్స్ ముందు అదిరింది షో తేలిపోతూ. టీఆర్పీ రేటింగ్ లోను వెనుకబడిపోయింది. అయితే జబర్దస్త్ మీద కసి తీర్చుకోవాలనుకున్న కోరిక నాగబాబు కి తీరడం లేదు.

అదిరింది షో కి తక్కువ టీఆర్పీ రావడం.. జబర్దస్త్ ముందు అదిరింజి చిన్నబోవడంతో… నాగబాబు అవమానంగా ఫీల్ అవుతున్నాడట. ఇప్పటివరకు జరిగిన నాలుగు ఎపిసోడ్స్ లోను అదిరింది ప్రోగ్రాం టీఆర్పీ పెరగకుండా అదే కంటిన్యూ అవడంతో.. నాగబాబు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడట. జబర్దస్త్ లో ఎపిసోడ్ కి 10 లక్షల పారితోషకం వస్తే.. అదిరింది కి 25 లక్షలిచ్చారట జీ ఛానల్ వారు. అయితే పారితోషకానికి సరిపడా క్రేజ్ రాకపోవడంతో నాగబాబు ఇప్పుడు అదిరింది నుండి బయటికెళ్లడానికి ఆలోచన చేస్తున్నాడట. అయితే జబర్దస్త్ ముందు అదిరింది ప్రోగ్రాం లేపడానికి జబర్దస్త్ మీదే పంచ్ లు వేసిన నాగబాబు కి అదిరింది షో పెద్ద పంచ్ గా కనబడడం.. ఇక ప్రస్తుతం కొన్నాళ్ళు పాటు టివి షోస్ కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయానికి నాగబాబు వచ్చినట్లుగా టాక్. ఈలోపు పవన్ కళ్యాణ్ జనసేనని వదిలి సినిమాల్లోకి రావడంతో.. నాగబాబు జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలనే ఆలోచనలో ఉన్నట్లుగా టాక్.

Tags:    

Similar News