10 లక్షల ఫైన్ కట్టాడు. అక్కడెంత నొక్కేస్తున్నాడో?

జబర్దస్త్ లో అవినాష్ కి మాస్ అవినాష్ గా మంచి క్రేజ్ ఉంది.. కెవ్వు కార్తీక్ – మాస్ అవినాష్ టీం కి మంచి క్రేజ్ ఉంది. [more]

Update: 2020-09-19 07:30 GMT

జబర్దస్త్ లో అవినాష్ కి మాస్ అవినాష్ గా మంచి క్రేజ్ ఉంది.. కెవ్వు కార్తీక్ – మాస్ అవినాష్ టీం కి మంచి క్రేజ్ ఉంది. అంత క్రేజ్ తో అవినాష్ బయట షోస్ కూడా చేస్తుంటాడు. అందుకే బిగ్ బాస్ సీజన్ 4 కి అవినాష్ ని స్పెషల్ గా తీసుకున్నారు బిగ్ బాస్ యాజమాన్యం,. అయితే జబర్దస్త్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న అవినాష్ జబర్దస్త్ నుండి బిగ్ బాస్ కి వెళ్ళడానికి మల్లెమాల కి 10 లక్షల ఫైన్ కట్టాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ ని వదిలి వేరే షోకి వెళ్ళడానికి మల్లెమాల కంటెస్టెంట్స్ నుండి 10 లక్షల ఫైన్ వసూలు చేస్తుందట. దానికి అవినాష్ ఓకె చెప్పి పది లక్షల ఫైన్ కట్టినట్టుగా న్యూస్ ఉంది.

అయితే అక్కడ అవినాష్ 10 లక్షల భారీ ఫైన్ కట్టి ఇక్కడ బిగ్ బాస్ లో ఎంటర్టైన్ చెయ్యడానికి వచ్చాడు. బిగ్ బాస్ లో జోకర్ లా అడుగుపెట్టినప్పటినుండి అవినాష్ కామెడీతో ఆకట్టుకుంటున్నాడు. బుల్లితెర ప్రేక్షకులు, బిగ్ బాస్ ప్రేక్షకుల అటెంక్షన్ ని అవినాష్ ఆటోమాటిక్ గా తన వైపు తిప్పుకోవడానికి కారణం బిగ్ బాస్ లో పస ఉన్న కంటెస్టెంట్స్ లేకపోవడమే. అయితే బిగ్ బాస్ లో అవినాష్ కి రోజుకి 50 వేల చొప్పున పారితోషకం ఫిక్స్ చేసిందట బిగ్ బాస్ యాజమాన్యం. జబర్దస్త్ లో క్రేజ్ ఉన్న అవినాష్ ని బిగ్ బాస్ లోకి రప్పించి రోజుకి 50 వేలు కడుతున్నారట. లాస్య, అమ్మ రాజశేఖర్ లాగా అవినాష్ కి కి బిగ్ బాస్ రోజుకి 50 వేలు ఇస్తుందట. ఇక అవినాష్ ని ఓ రెండు నెలలపాటు షోలో ఉంచే ప్లాన్ తోనే బిగ్ బాస్ టీం అవినాష్ ని హౌస్ లోకి పంపిందట.

Tags:    

Similar News