రోజా కూడా వెళ్ళిపోతే దిక్కెవరు…

ఈటివి జబర్దస్త్ షో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నాగబాబు జబర్దస్త్ టీం కి, మల్లెమాల టివి కి హ్యాండిస్తే. … ఇప్పుడు రోజా కూడా జబర్దస్త్ [more]

Update: 2019-11-19 04:53 GMT

ఈటివి జబర్దస్త్ షో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. నాగబాబు జబర్దస్త్ టీం కి, మల్లెమాల టివి కి హ్యాండిస్తే. … ఇప్పుడు రోజా కూడా జబర్దస్త్ జడ్జ్ పోస్ట్ నుండి తప్పుకోనుందనే వార్త మల్లెమాల ప్రొడ్యూసర్స్ ని షాక్ కి గురి చేస్తుంది. నాగబాబు వెళ్ళిపోతే ఆయన ప్లేస్ లో కూర్చోబెట్టడానికి అలీ లేదా బండ్ల గణేష్ ని మల్లెమాల వారు సంప్రదిస్తున్నట్టుగా వార్తలొస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా కూడా జడ్జ్ సీటు నుండి తప్పుకోనుందనే న్యూస్ ఇప్పుడు కామెడీ ప్రియులకు నిద్రలేకుండా చేస్తుంది.

ఎన్నికల ప్రచారం అప్పుడు జబర్దస్త్ కి కాస్త బ్రేకిచ్చిన రోజా… గత ఏడేళ్లలో జబర్దస్త్ జడ్జ్ సీటుని వదల్లేదు. కానీ ఇప్పుడు మాత్రం తన అన్న ఏపీ సీఎం జగన్ చెప్పాడనే కారణంతో రోజా జబర్దస్త్ ని వీడబోతుందట. గత ప్రభుత్వం రోజా మీద జబర్దస్త్ గా ఎన్ని సెటైర్స్ వేసినా కానీ లొంగని రోజా, జగనన్న చెప్పినమాటకి విలువనివ్వబోతుందట. జగన్ క్యాబినెట్ లో మంత్రిగా చోటు దొరకని రోజాకి జగన్ ఏపీఐఐసీ చైర్మన్ పదవితో గౌరవించినప్పటికీ.. రోజాకి తన క్యాబినెట్ లో వచ్చే రెండేళ్లలో మంత్రి పదవి ఇస్తానని హమి ఇచ్చాడనే న్యూస్ ఉంది. అయితే రోజా తనకు అప్పగించిన ఏపీఐఐసీ చైర్మన్‌ బాధ్యతలు కంటే.. కామెడీ షో అయిన జబర్దస్త్ షోలకే సమయం ఎక్కువగా కేటాయిస్తుందని.. సీఎం జగన్, రోజాను పిలిచి జబర్దస్త్ షో కి విరామం ఇవ్వమని కాస్త క్లాస్ పీకినట్టుగా టాక్. జబర్ధస్త్ షో ను పక్కన పెట్టి.. తనకి అప్పజెప్పిన ప్రభుత్వ బాధ్యతలను పూర్తి స్థాయిలో చేపట్టాలని జగన్, రోజాకి చెప్పడంతో రోజా కూడా జబర్దస్త్ ని వదిలేస్తుంది అంటున్నారు. మరి నాగబాబు తో రోజా కూడా వెళ్ళిపోతే… జబర్దస్త్ షోనే ఆగిపోతుందేమో అంటున్నారు

Tags:    

Similar News