బాబు గారు బయటికెళ్ళడం రోజాకి కలిసొచ్చింది

నాగబాబు జబర్దస్త్ జర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఆయన కి నచ్చి వెళ్ళాడో అలిగి వెళ్ళాడో అనేది అందరికి తెలిసిందే. అయితే నాగబాబు జబర్దస్త్ టీం [more]

Update: 2019-11-29 06:02 GMT

నాగబాబు జబర్దస్త్ జర్నీ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఆయన కి నచ్చి వెళ్ళాడో అలిగి వెళ్ళాడో అనేది అందరికి తెలిసిందే. అయితే నాగబాబు జబర్దస్త్ టీం ని తనవైపు లాక్కుని ఎలాగైనా మల్లెమాల టీం కి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ నాగబాబు లాగితే మేము వెళ్ళం అని చెప్పకనే చెబుతూ… జబర్దస్త్ లో స్కిట్స్ చేసుకుంటున్న జబర్దస్త్ కమేడియన్స్, నాగబాబు వీర విధేయులే నాగబాబుకు షాకిచ్చారు. కారణం మరో జేడ్జ్ రోజా చెప్పినట్టు.. జబర్దస్త్ ఆదుకుని అన్నం పెట్టిందే కాదు, జబర్దస్త్ ని వదిలి వెళ్ళాక మళ్ళి జబర్దస్త్ లోకి అడుగుపెట్టడానికి వేణు, ధనరాజ్ లులా ఇబ్బంది పడాలని రోజా హెచ్చరిక పనిచేయడమే అంటున్నారు.

మరో పక్క జబర్దస్త్ నుండి కమేడియన్స్ ని జారకుండా రోజా చేసిన పనికి మెచ్చిన మల్లెమాల ప్రొడ్యూసర్స్ రోజా పారితోషకం అమాంతం పెంచినట్లుగా ఫిలింనగర్ టాక్. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ… తనకి కావల్సిన డబ్బు కోసం రోజా జబర్దస్త్ ని వదలకుండా అంటిపెట్టుకుని వేళ్ళాడింది. అయితే రోజా కి నాగబాబు బయటికెళ్ళడం మాత్రం బాగా కలిసొచ్చిదనే చెప్పాలి. ఇంతకుముందు ఇద్దరు జడ్జ్ లకు ఇచ్చే పారితోషకాన్ని ఇప్పుడు ఒక జడ్జ్ అయ్యేసరికి ఆ జడ్జ్ పారితోషకం డబుల్ చెయ్యడం వాళ్ళకి పెద్ద ఇబ్బందిగా అనిపించడం లేదుట. మరి జడ్జ్ గా మరో సెలెబ్రిటీ దొరికినా… మొదట్లో వారికీ పారితోషకం అంతగా
ఉండకపోవచ్చనే టాక్ ఉంది.

Tags:    

Similar News