నాగబాబు వెళ్లినా… మేము మాత్రం

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. అదే టైం లో జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్, ఎనెన్నో అనుకుంటాం.. అనే కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మల్లి బుల్లితెర ప్రేక్షకుల [more]

Update: 2019-11-25 04:47 GMT

నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. అదే టైం లో జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్, ఎనెన్నో అనుకుంటాం.. అనే కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మల్లి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. అయితే నాగబాబు తో పాటుగా అనసూయ కూడా జబర్దస్త్ వదిలేస్తుంది.. అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అనసూయ జీ ఛానల్ లో లోకల్ గ్యాంగ్స్ , ఎన్నెన్నో అనుకుంటామనే ప్రోగ్రాంలో డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తో కలిసి మెరవడంతో… అనసూయ కూడా జబర్దస్త్ కి హ్యాండ్ ఇచ్చిందనే టాక్ నడుస్తుంది.

మరో పక్క నాగబాబు వీర విధేయుడు హైపర్ ఆది కూడా జబర్దస్త్ ని వీడనున్నాడనే టాక్ మొదలైంది. ఇప్పటికే ఆది, నాగబాబు తో వెళ్లిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడని, కానీ జబర్దస్త్ నుండి ఆది వెళ్ళడానికి ఆయన టీం సభ్యులు కానీ, మల్లెమాల టీం కానీ ఒప్పుకోలేదని, లేదంటే ఆది ఎప్పుడో జంప్ అయ్యేవాడని అంటున్నారు. అయితే అటు అనసూయ, ఇటు ఆది కూడా తామింకా జబర్దస్త్ లోనే ఉన్నామని, తాము చెప్పేవరకు తమ మీద వచ్చే రూమర్స్ నమ్మొద్దంటూ సోషల్ మీడియా వేదికగా వారిద్దరూ.. నాగబాబు వెళ్లినా మేం జబర్దస్త్ లోనే ఉన్నామంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు

Tags:    

Similar News