ఆ టాప్ నిర్మాత కి మళ్ళీ పెళ్లి?

టాలీవుడ్ టాప్ నిర్మాతగా పలు సినిమాలను సెట్స్ మీద ఉంచిన దిల్ రాజు మీద వినబడుతున్న న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అంటే ఆయనేదో నేరం [more]

Update: 2020-02-10 07:05 GMT

టాలీవుడ్ టాప్ నిర్మాతగా పలు సినిమాలను సెట్స్ మీద ఉంచిన దిల్ రాజు మీద వినబడుతున్న న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అంటే ఆయనేదో నేరం చేసాడు, తప్పు చేసాడని కాదు గానీ.. దిల్ రాజు మళ్ళీ పెళ్లి అనే న్యూస్ మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. దిల్ రాజు భార్య అనిత రెండేళ్ల క్రితం హార్ట్ ఎటాక్ తో సడన్ గా చనిపోయారు. అప్పట్లో భార్య చనిపోయినప్పుడు దిల్ రాజు షూటింగ్ విషయంలో అమెరికాలో ఉండడంతో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. దిల్ రాజు కి ఒక కూతురు. అల్లుడిని కూతుర్ని ఇంట్లోనే తనతో ఉంచేసుకున్న దిల్ రాజు ఈమధ్యన ఒంటరి తనం బాగా ఫీల్ అవుతున్నాడని.. అందుకే తనకంటూ ఓ తోడు ఉండాలని అనుకుంటున్నట్లుగా ఫిలింనగర్ టాక్..

దిల్ రాజు మల్లి పెళ్లి విషయంలో సన్నిహితుల ఇచ్చిన సలహాతోనే మరో పెళ్ళికి సిద్దపడినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అమ్మాయిని కూడా చూసారని, సినీ నేపథ్యంలేని బ్రాహ్మణ యువతితో దిల్ రాజు పెళ్లి జరగనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఆ పెళ్లి కూడా వేసవిలో జరగనున్నట్లుగా తెలుస్తుంది. మరి దిల్ రాజు మళ్ళీ పెళ్లి విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన స్పందిస్తేనే కానీ తెలియదు. భర్య పోయాక సినిమాలనే ఇష్టంగా మార్చుకుని.. ఖాళీ లేని బిజీ లైఫ్ గడుపుతున్న దిల్ రాజు తోడు కోసం ఆలోచించడం కరెక్ట్ కానీ..

Tags:    

Similar News