దిల్ రాజు కి ఇంత పిచ్చేందయ్యా

దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే పిచ్చిని పింక్ రీమేక్ తో తీర్చుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తో కాస్ట్లీ వ్యవహారమని చెప్పినా దిల్ [more]

Update: 2020-01-23 05:22 GMT

దిల్ రాజు కి పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనే పిచ్చిని పింక్ రీమేక్ తో తీర్చుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ తో కాస్ట్లీ వ్యవహారమని చెప్పినా దిల్ రాజు కి పవన్ క్రేజ్ ముందు ఏది వినబడడం లేదు. అందుకే పవన్ కి సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి రెడీ అవ్వడమే కాదు.. పవన్ కళ్యాణ్ రోజుకి రెండు గంటలే షూటింగ్ అన్నా పర్వాలేదని తలూపాడు. మరి పవన్ సినిమాలు రాజకీయాలను రెండిటిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అంటే.. దిల్ రాజు లాంటి నిర్మాత దొరకబట్టె. అన్నిటిలో పట్టుబట్టే దిల్ రాజు పవన్ విషయంలో కామ్ గా ఉన్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు ఎంత కాస్ట్లీ యవ్వారం నడుపుతున్నాడో అనేది అందరికి షాకిస్తున్న న్యూస్.

అదేమిటంటే పవన్ పొద్దున్నే సినిమా సాయంత్రం రాజకీయాలంటూ.. పొద్దున్నే హైదరాబాద్.. సాయంత్రం అమరావతిలో కనబడుతున్నాడు. దానికి గాను దిల్ రాజు ఏకంగా పవన్ కళ్యాణ్ కంఫర్ట్ కోసం ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ ని ఎరేంజ్ చేసాడనే న్యూస్ ఉంది చూడండి.. దిల్ రాజుకి పవన్ తో సినిమా చేసే పిచ్చి పీక్స్ లో ఉందనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆ ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్ లోనే షూటింగ్ తో పాటు రాజకీయాల కోసం పరుగులు పెడుతున్నాడు. మరి రోజుకి నాలుగు లక్షలు ఆ చార్టెడ్ ఫ్లైట్ కోసం దిల్ రాజు ఖర్చు చేస్తున్నాడట. ఆ లెక్కన పవన్ కళ్యాణ్ షూటింగ్ కి హాజరైనన్ని రోజులు దిల్ రాజుకి తడిసిమోపుడవ్వడం ఖాయంగా కనబడుతుంది.

Tags:    

Similar News