‘సై రా’ కి ‘వార్’ టెన్షన్ పోతుందా?

నాలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సై రా ప్రమోషన్స్ ముంబై వేదికగా మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు సై రా పోస్టర్స్ మోత మోగించిన సై రా [more]

Update: 2019-08-22 06:11 GMT

నాలుగు భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సై రా ప్రమోషన్స్ ముంబై వేదికగా మొదలైపోయాయి. నిన్నమొన్నటివరకు సై రా పోస్టర్స్ మోత మోగించిన సై రా టీం నిన్నటినుండి టీజర్ తో హంగామా చేస్తుంది. నాలుగు భాషల్లో భారీ ఎత్తున అక్టోబర్ 2 న విడుదలకాబోతున్న సై రా నరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇండియా వైడ్ గా మంచి బిజినెస్ చేస్తున్న సై రా సినిమా ఎక్కువగా హిందీ మార్కెట్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే సినిమా టీం మొత్తం ముంబై లో మీడియా సమావేశంతో పాటుగా పలు నేషనల్ ఛానల్స్ కి ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా గడిపేస్తుంది. ఇక అన్ని భాషల్లోనూ మెగాస్టార్ చిరు సై రా కి ఎదురు నిలబడడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు కానీ.. బాలీవుడ్ మాత్రం సై రా కి హృతిక్ రోషన్ వార్ తో టెన్షన్ పెడుతున్నాడు. సై రా ని ఎంత భారీగా విడుదల చేసినా.. హిందీ లో హృతిక్, టైగర్ షరాఫ్ నటించిన వార్ అంత కాదు.మొన్నామధ్యన విడుదల చేసినా వార్ టీజర్ చూస్తే సినిమా మీద ఎంత అంచనాలున్నాయో తెలుస్తుంది. ఒకే ఒక్క టీజర్ తో వార్ మీద అంచనాలు పెరిగి సై రా బృందానికి టెన్షన్ మొదలయ్యింది. అక్టోబర్ 2 న తమకి గట్టి పోటీ ఇచ్చేది వార్ అని ఫిక్స్ అయ్యారు కూడా.

వార్ సినిమా కూడా సాహోలాగా భారీ యాక్షన్ సన్నివేశాలతో నిండిపోయి సినిమా మీద అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసింది. సై రా మాత్రం ఓ స్వాతంత్య్ర సమరయోధుడి చారిత్రాత్మక కథతో తెరకెక్కింది. మరి యాక్షన్ సినిమా మీదున్న ఇంట్రెస్ట్ చారిత్రాత్మక సినిమాల మీద ఎక్కువ కలగదు. అయితే తాజాగా వార్ కి విడుదల కష్టాలు మొదలైనట్టుగా టాక్. అదేమంటే యశ్ రాజ్ ఫిలిమ్స్ వార్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. అయితే గతంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మీదున్న అంచనాలతో భారీ రేట్లకి బయ్యర్లకి ఆ సినిమాని ఆమ్మేశారట. అయితే ఆ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అంచనాలను తల్లకిందులు చేస్తూ భారీ ప్లాప్ అవడంతో.. భారీగా నష్టపోయిన బయ్యర్లు యశ రాజ్ ఫిలిమ్స్ వారిని తమకి కొంత మొత్తం సెటిల్ చెయ్యమని అడిగితె వారు ససేమిరా అన్నారట. అయితే ఆ విషయాన్నీ కడుపులో పెట్టుకున్న బయ్యర్లు ఇపుడు వార్ సినిమాని తక్కువ రేట్లకి అడుగుతుంటే యశ రాజ్ ఫిలిమ్స్ కుదరదని చెబుతుందట. అయితే బయ్యర్లంతా సిండికేట్ గా ఏర్పడి వార్ సినిమాని కొనద్దనే నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అదే జరిగితే వార్ వాయిదా పడడం ఖాయం. వార్ వాయిదా పడితే సై రా రెచ్చిపోవడం ఖాయం. అలా ప్రస్తుతానికికి వార్ వాయిదా న్యూస్ తో సై రా టీం ఆనంద పడుతున్నట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News