కాజల్ చుట్టూ పోలీసు లు?

అందమైన చందమామ చుట్టూ పోలీస్ లేమిటి అనుకుంటున్నారా.. మరి గత నెలలో చెన్నైలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ టైం లో అక్కడ సెట్స్ లో జరిగిన [more]

Update: 2020-03-07 06:07 GMT

అందమైన చందమామ చుట్టూ పోలీస్ లేమిటి అనుకుంటున్నారా.. మరి గత నెలలో చెన్నైలో ఇండియన్ 2 సినిమా షూటింగ్ టైం లో అక్కడ సెట్స్ లో జరిగిన ఘోరప్రమాదాన్ని కాజల్ అగర్వాల్ కూడా ప్రత్యక్షంగా చూసింది కదా అందుకు. ఇండియన్ 2 ఘటనపై ఇప్పటికే పోలీస్ విచారణ వేగవంతం అయ్యింది. అక్కడ ముగ్గురు చనిపోవడం, పలువురికి గాయాలవడం ప్రత్యక్షంగా చూసిన హీరోయిన్ కాజల్ ఒణికిపోయిన విషయం తెలిసిందే. ఇక దర్శకుడు శంకర్ అయితే.. ఆ ప్రమాదంలో నేను చనిపోయినా బావుండేదన్నాడు. ఇక ఆ ఘటనలో ప్రత్యక్ష సాక్షులైన హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ ఇంకా చాలామందిని ఇప్పటికే పోలీస్ లు విచారించారు.

తాజాగా కాజల్ కోసం కూడా పోలీస్ లు రాబోతున్నారని, కాజల్ ని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. కాజల్ కూడా ఘటన స్థలంలోనే ఉండడంతో.. కాజల్ ని కూడా పోలీస్ విచారణకు పిలవబోతున్నారని.. ఇందుకోసం పోలీసులు కాజల్ కు సమన్లు జారీ చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ సమన్లు అందుకోగానే.. విచారణకు హాజరు కావాలని చెబుతున్నారు. పాపం హీరోయిన్ గా కాజల్ ఇంతవరకు చూడని ఘటన ఇండియన్ 2 సెట్స్ లో చూడల్సి వచ్చింది అని చాలా బాధపడింది. ఇప్పుడు ఈ పోలీస్ ల మేళం ఒకటి. అమ్మడు ఎలా తట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News